Begin typing your search above and press return to search.

TAKE 20 లో TOP-5 ఇవేనా!

ఇందులో ఆరోగ్యం గురించి అనేక విషయాలను పంచుకుంటున్న‌ట్లు తెలిపింది.

By:  Tupaki Desk   |   8 April 2024 1:08 PM GMT
TAKE 20 లో TOP-5  ఇవేనా!
X

స్టార్ హీరోయిన్ స‌మంత మ‌యోసైటిస్ భారిన ప‌డి కోల్కోవ‌డం తెలిసిందే. ఆ స‌మ‌యంలో తానెంత‌గా ఇబ్బంది ప‌డిందో? ఎన్నో సంద‌ర్భాల్లో రివీల్ చేసింది. త‌న‌లో ఇత‌రులు బాధ‌ప‌డకూడ‌ద‌ని..ఆరోగ్య విష‌యంలో జాగ్ర‌త్త‌లు వ‌హించాల‌ని సూచించింది. ఈ నేప‌థ్యంలో పాడ్ కాస్ట్ ని ప్రారంభించింది. శారీరక ఆరోగ్యం గురించి TAKE 20 అనే పేరుతో పాడ్ కాస్ట్ స్టార్ట్ చేసింది. ఇందులో ఆరోగ్యం గురించి అనేక విషయాలను పంచుకుంటున్న‌ట్లు తెలిపింది.

శారీరక ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలి ? శారీరక ఆరోగ్యం ప్రాముఖ్యత ఏంటీ ? రోజూవారీ జీవితంలో శారీరక ఆరోగ్యం గురించి తెలుసుకోవాల్సిన విషయాలను మనం ఎలా మిస్ అవుతున్నాం ? ఆరోగ్యం విషయంలో చేస్తోన్న పొరపాట్లు ఏంటీ ? ఇలా అనేక విషయాలను సమంత ఈ పాడ్ కాస్ట్ లో స్వయంగా వెల్ల‌డిస్తుంది. అనేక పరిశోధనల ద్వారా శారీరక ఆరోగ్యం గురించి తాను తెలుసుకున్న విషయాలను అందరికీ తెలియజేయాలనేది ఈ పాడ్ కాస్ట్ ఉద్దేశమని సమంత చెప్పుకొచ్చింది.

తాజాగా సమంత టాప్ -5 మార్నింగ్ రొటీన్ సీక్రెట్‌లను రివీల్ చేసింది. ఆమె ఉదయం 5:30 గంటలకు మేల్కొని జర్నలింగ్ చేయడం. ఐదు నిమిషాల పాటు తొలి సూర్య‌కిర‌ణాలు చ‌ర్మంపై ప‌డేలా చూసుకోవ‌డం. ఇవి రెండు మాన‌సిక స్థితిని నిల‌క‌డ‌గా ఉంచుతాయి. అలాగే సమంత దినచర్యలో శ్వాస వ్యాయామాలు కూడా ఎంతో కీలకంగా పేర్కొంది. విమ్ హాఫ్ మెథడ్‌ను ఉపయోగించుకుంటుంది. ఇది శక్తినిచ్చే ప్రభావాలు మరియు సంభావ్య ఆరోగ్య ప్రయోజనాలకు ప్రసిద్ధి చెందింది.

ఉద‌యాన్నే ధ్యానం కూడా అంతే కీల‌కంగా తెలిపింది. అలాగే EFT (ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్)ని పరిచయం చేసింది. దీనిని ట్యాపింగ్ అని కూడా పిలుస్తారు. ఈ అభ్యాసం శక్తిని సమతుల్యం చేయడం మరియు నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. దిన‌చ‌ర్య‌లో వీటిని భాగం చేసుకుంటే ఎన్నో అనారోగ్యాల భారి నుంచి బ‌య‌ట‌ప‌డే అవ‌కాశం ఉంటుంద‌ని` తెలిపింది.