Begin typing your search above and press return to search.

చరణ్ మూవీలో మరో స్టార్ బ్యూటీ.. పెద్ద స్కెచ్చే!

అందులో భాగంగా మూవీలో ఓ కీలక పాత్ర కోసం స్టార్ హీరోయిన్ సమంతను సంప్రదించారట. అందుకు సామ్ కూడా ఓకే చెప్పారట.

By:  Tupaki Desk   |   6 Feb 2024 12:30 PM GMT
చరణ్ మూవీలో మరో స్టార్ బ్యూటీ.. పెద్ద స్కెచ్చే!
X

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఆర్ఆర్ఆర్ తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీగా మారారు. ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ మూవీలో నటిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. సెప్టెంబర్ లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.

ఇక ఈ చిత్రం తర్వాత ఉప్పెన ఫేం బుచ్చిబాబు దర్శకత్వంలో సినిమా చేయడానికి రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను మొదలుపెట్టారు దర్శకుడు. గేమ్ ఛేంజర్ మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యాక.. ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఇక రామ్ చరణ్ బర్త్ డే రోజు పూజా కార్యక్రమాలు జరుగుతాయని టాక్.

అయితే ఈ సినిమాలోని నటీనటుల ఎంపికపై బుచ్చిబాబు కసరత్తు చేస్తున్నారట. అందులో భాగంగా మూవీలో ఓ కీలక పాత్ర కోసం స్టార్ హీరోయిన్ సమంతను సంప్రదించారట. అందుకు సామ్ కూడా ఓకే చెప్పారట. ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్.. సంబరపడిపోతున్నారు. బ్లాక్ బస్టర్ మూవీ రంగస్థలం తర్వాత మరోసారి చరణ్, సామ్ ను స్క్రీన్ పై చూసేందుకు వెయిట్ చేస్తున్నట్లు చెబుతున్నారు.

మరోవైపు, ఈ మూవీ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతోందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. రామ్ చరణ్ ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన యువకుడిలా కనిపించనున్నారని టాక్ నడుస్తోంది. అందుకోసం ఆ ప్రాంత యాస కూడా చరణ్ నేర్చుకుంటున్నారట. దర్శకుడు బుచ్చిబాబు.. నాలుగేళ్లుగా ఈ మూవీ స్క్రిప్ట్‌పై కసరత్తు చేస్తున్నారట. తప్పకుండా బ్లాక్‌బస్టర్ హిట్ సాధిస్తాననే నమ్మకంతో ఉన్నారట.

ఈ సినిమాలోని మరో కీలక పాత్రలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ నటించనున్నారు. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారు. ఈ చిత్రంలో సమంతతో పాటు సాయి పల్లవి, విజయ్ సేతుపతి కూడా నటిస్తున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. మరి ఈ సినిమాకు సంబంధించిన అన్ని విషయాలపై మేకర్స్ ఎప్పుడు అధికారిక ప్రకటన ఇస్తారో చూాడాలి.