Begin typing your search above and press return to search.

2024 లో స‌మంత స‌ర్ ప్రైజ్ ఎలా అంటే?

స‌మంత కొన్ని నెల‌లుగా విరామంలో ఉన్న సంగ‌తి తెలిసిందే. `ఖుషీ` పూర్తి చేసిన వెంట‌నే అమ్మ‌డు అమెరికా ప్లైట్ ఎక్కేసి అక్క‌డే విశ్రాంతి తీసుకుంటుంది.

By:  Tupaki Desk   |   4 Jan 2024 6:37 AM GMT
2024 లో స‌మంత  స‌ర్ ప్రైజ్ ఎలా అంటే?
X

స‌మంత కొన్ని నెల‌లుగా విరామంలో ఉన్న సంగ‌తి తెలిసిందే. `ఖుషీ` పూర్తి చేసిన వెంట‌నే అమ్మ‌డు అమెరికా ప్లైట్ ఎక్కేసి అక్క‌డే విశ్రాంతి తీసుకుంటుంది. పూర్తి ఆరోగ్య వంతురాలిగా తిరిగి రావాల‌ని అలా ప్లాన్ చేసి ప్లైట్ ఎక్కింది. ఇప్ప‌టికే కొన్ని నెల‌లు గ‌డిచిపోయింది. మ‌రి అమ్మ‌డు న్యూ ఇయ‌ర్ లో కెరీర్ ని ఎలా ప్లాన్ చేస్తుంది? అమ్మ‌డు మ్యాక‌ప్ వేసుకోవ‌డానికి సిద్దంగానే ఉందా? అన్ని ర‌కాలుగా సంసిద్ద‌మై కంబ్యాక్ కి రెడీ అవుతోందా? అంటే అవున‌నే తెలుస్తోంది.

తాజాగా ఇన్ స్టా గ్రామ్ లో వ‌ర్క్ మోడ్ లో బిజీ అవ్వ‌డానికి రెడీ అవుతున్న‌ట్లు చెప్ప‌క‌నే చెప్పింది. తీసుకున్న విశ్రాంతి చాలు. ఇక సీన్ లోకి వ‌చ్చేస్తాను అన్న సంకేతాలు పాస్ చేసింది. మ‌రి సొగ‌స‌రి త‌దుప‌రి ఏ హీరో సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది? ఏనెల‌లో ఆ సినిమా రిలీజ్ అవుతుంది? ఏంటి ఆ క‌హానీ అంటే మాత్రం క్లారిటీ లేదు. ఎందుకంటే స‌మంత ఇంత‌వ‌ర‌కూ కొత్త ప్రాజెక్ట్ ప్ర‌క‌టించింది లేదు.

ప్లైట్ ఎక్కిన ద‌గ్గ‌ర నుంచి క‌మిట్ మెంట్లు అన్ని ప‌క్క‌న‌పెట్టే సి విరామంలోనే ఉంది. ఇప్పుడు రావ‌డానికి రెడీ గా అయితే ఉంది కానీ... ఏ సినిమా చేస్తుంది? అన్న‌ది త‌న‌కి కూడా క్లారిటీ లేదు. బాలీవుడ్ లో సినిమా చేస్తుందా? టాలీవుడ్ లో సినిమా చేస్తుందా? ఈ రెండు గాక ఇంకేదైనా భాష‌లో చేస్తుందా? అన్న‌ది తెలియ‌దు. ఇప్ప‌టికే హిందీలో `సీటాడెల్` షూటింగ్ పూర్తి చేసింది. అది రిలీజ్ కావాల్సి ఉంది. కానీ ఆ వెబ్ సిరీస్ కి సంబంధించి ఎలాంటి అప్ డేట్ కూడా లేదు.

ఎప్పుడు రిలీజ్ అవుతుంది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ఎంత‌వ‌ర‌కూ వ‌చ్చింది ? అన్న‌ది తెలియ‌దు. అయితే స‌మంత వెళ్తూ వెళ్తూ కంబ్యాక్ ని మాత్రం బాలీవుడ్ లోనే ప్లాన్ చేసుకుంద‌ని గ‌ట్టి ప్ర‌చార‌మైతే సాగింది. హిందీ ప‌రిశ్ర‌మ‌లో నిల‌దొక‌ర్కుకునే కొన్ని ర‌కాల ప్ర‌య‌త్నాలు కూడా చేసింది. క‌ర‌ణ జోహార్ టాక్ షోలో పాల్గొన‌డం..అక్ష‌య్ కుమార్ తో స‌ర‌దా మూవ్ మెంట్లు ఇలా కొంత హంగామా చేసింది. అలాగే తాప్సీ నిర్మాణంలో ఓ సినిమా కి సైన్ చేసిన‌ట్లు ప్ర‌చారం సాగింది. మ‌రి ఆ హంగామా అవ‌కాశాలు తెచ్చి పెట్టిందా? తాప్సీ నిజంగా అవ‌కాశం ఇచ్చిందా? అన్న‌ది స‌మంత చెబితేగానీ క్లారిటీ రాదు సుమీ.