Begin typing your search above and press return to search.

స‌మంత ముంబైకి షిఫ్ట్?

బాలీవుడ్ లో సామ్ పెద్ద కెరీర్ ని ఆశిస్తోంది. అదే క్ర‌మంలో ప‌ర్మినెంట్ గా ఉండేందుకు సౌక‌ర్య‌మైన ఇల్లును వెతుకుతోంది అంటూ క‌థ‌నాలు వినిపిస్తున్నాయి.

By:  Tupaki Desk   |   29 March 2024 2:45 AM GMT
స‌మంత ముంబైకి షిఫ్ట్?
X

స‌మంత ప్ర‌స్తుతం వ‌రుస‌ సినిమాల్లో న‌టించేందుకు సిద్ధ‌మ‌వుతోంది. ఇటీవ‌ల 'సిటాడెల్- హ‌నీ బ‌న్ని' ప్ర‌మోష‌న్స్‌లో బిజీ అయింది. రస్సో బ్రదర్స్ తెర‌కెక్కించిన అమెరిక‌న్ టీవీ సిరీస్ సిటాడెల్ కి భారతీయ వెర్ష‌న్ ఇది. ఈ వెబ్ సిరీస్ త‌ర్వాత స‌మంత తెలుగు సినిమాల కంటే హిందీ ప్రాజెక్టులకే ప్రాధాన్యత ఇస్తుందని తెలుగు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాదు.. ముంబైలో త‌న‌కు అనుకూలంగా ఉండే ఒక సొంత ఇంటి కోసం స‌మంత వెతుకుతోంద‌ని కూడా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ లో సామ్ పెద్ద కెరీర్ ని ఆశిస్తోంది. అదే క్ర‌మంలో ప‌ర్మినెంట్ గా ఉండేందుకు సౌక‌ర్య‌మైన ఇల్లును వెతుకుతోంది అంటూ క‌థ‌నాలు వినిపిస్తున్నాయి.

ఇప్పుడు హిందీ సినిమాలో న‌టించినా లేదా తెలుగు లేదా త‌మిళ సినిమాలో న‌టించినా అది భార‌తీయ సినిమాగా ప‌రిగ‌ణించాలి. అందువ‌ల్ల భాష‌తో స‌మ‌స్య లేదు. ఏ భాష‌లో సినిమా తెర‌కెక్కినా ఇత‌ర భాష‌ల్లోను అంతే క్రేజీగా అనువాద‌మై విడుద‌ల‌వుతున్నాయి.

భారతదేశంలో రెండవ అతిపెద్ద చిత్ర పరిశ్రమ అయిన తెలుగు సినిమాకి ఇప్పుడు తెలుగు డ‌యాస్పోరాతో పాటు, హిందీ బెల్ట్ లోను క్రేజ్ నెల‌కొంది. స‌మంత‌కు తెలుగు సినిమా వ‌ల్ల‌నే ఇంత పెద్ద స్థాయి ద‌క్కింది. ఇప్పుడు హిందీలోను సామ్ పాపుల‌ర‌వ్వ‌డానికి తెలుగు సినిమాలే కార‌ణం.

అయితే త‌న‌కు హిందీ చిత్ర‌సీమ‌లో ప్ర‌స్తుతం ఉన్న డిమాండ్ దృష్ట్యా దీర్ఘ కాలిక ప్ర‌ణాళిక‌ల‌తో ముందుకు సాగుతోంద‌ని భావించాలి. అక్క‌డ త‌న హ‌వా సాగినంత కాలం ప్ర‌య‌త్నాలు కొన‌సాగిస్తుంది. అదే స‌మ‌యంలో సౌత్ లోను త‌న‌వైపు వ‌చ్చిన అవ‌కాశాల‌ను వ‌దులుకోక‌పోవ‌చ్చు. అయితే మ‌ల్టీ లాంగ్వేజ్ లో ప‌రిశ్ర‌మ‌ల్ని ఎలా మ్యానేజ్ చేస్తుందో వేచి చూడాలి. మ‌యోసైటిస్ నుంచి కోలుకున్న త‌ర్వాత స‌మంత కొత్త ప్ర‌ణాళిక‌లు అభిమానుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నాయి. కానీ సామ్ కంబ్యాక్ కోసం అభిమానులంతా ఆస‌క్తిగా వేచి చూస్తున్నారు. త‌దుప‌రి హిందీ అగ్ర హీరోల స‌ర‌స‌నా అవ‌కాశాలు అందుకుంటుంద‌నే భావిస్తున్నారు. ఏం జ‌ర‌గ‌నుందో కాల‌మే స‌మాధానం... జ‌స్ట్ వెయిట్ అండ్ సీ...