Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: సమంత తెల్ల చొక్కా వైబ్స్

సమంతా రూత్ ప్రభు ఇటీవల మ‌యోసైటిస్‌కి చికిత్స పొందుతోంది. కోలుకున్న క్ర‌మంలోనే తిరిగి ప‌నిని ప్రారంభిస్తున్నాన‌ని తెలిపారు

By:  Tupaki Desk   |   4 March 2024 10:48 AM GMT
ఫోటో స్టోరి: సమంత తెల్ల చొక్కా వైబ్స్
X

సమంత రూత్ ప్రభు సోష‌ల్ మీడియాల్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఆస్వాధిస్తోంది. ల‌క్ష‌లాదిగా అభిమానులు నిరంత‌రం త‌న నుంచి అప్ డేట్స్ కోసం వేచి చూస్తారు. ఇటీవ‌ల మ‌లేషియా విహారం నుంచి అంద‌మైన ఫోటోల‌ను స‌మంత‌ షేర్ చేయ‌గా వైర‌ల్ అయ్యాయి. ఇప్పుడు తన సోషల్ మీడియాలో మ‌రోసారి వరుస ఫోటోగ్రాఫ్స్ ను షేర్ చేస్తోంది. అభిమానుల్లో ప‌లువురు వీటిపై కామెంట్స్ చేయ‌గా, కొంద‌రు సామ్ లుక్ ని ప్రశంసించారు.

ఇన్‌స్టాలో ఫోటోల‌ను షేర్ చేసి 'బాధపడలేదు' అని క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫోటోలలో డెనిమ్ బ్లాక్ ఫ్యాంట్‌కి కాంబినేష‌న్ గా వైట్ కలర్ షర్ట్ ని ధరించి కనిపించింది. బోల్డ్ మేకప్‌కి భిన్నంగా మినిమలిస్టిక్ మేకప్‌తో క‌నిపించింది. ఈ లుక్ లో సామ్ చాలా అందంగా కనిపిస్తోంది. దీనికి అభిమానులు 'గార్జియస్ సూ హాట్' అంటూ ప్ర‌శంసించారు.

సమంతా రూత్ ప్రభు ఇటీవల మ‌యోసైటిస్‌కి చికిత్స పొందుతోంది. కోలుకున్న క్ర‌మంలోనే తిరిగి ప‌నిని ప్రారంభిస్తున్నాన‌ని తెలిపారు. 'బ్యాక్ టు వర్క్..' అని ఇన్ స్టా వేదిక‌గా ప్రకటించగానే అభిమానుల్లో చాలా ఉత్సాహం నెల‌కొంది. జూలై 2023లో సిటాడెల్ ఇండియా షూట్‌ను ముగించిన తర్వాత సమంత తన నటనకు విరామం ప్రకటించింది. ఆ తర్వాత తన ఆరోగ్యానికి ప్రాధాన్యతను ఇస్తానని తెలిపింది. ఎప్పుడూ నన్ను నేను వదులుకోకుండా.. మీరు గర్వపడేలా మంచి ప్ర‌ద‌ర్శ‌న‌ల‌తో మీ ముందుకు వ‌స్తాను అని వెల్ల‌డించింది.

సమంత చివరిసారిగా విజయ్ దేవరకొండతో తన రెండవ తెలుగు చిత్రం 'ఖుషి'లో కనిపించింది. మహానటి తర్వాత ఈ జంట క‌ల‌యిక‌లో రెండో చిత్ర‌మిది. గతేడాది సెప్టెంబర్ 1న విడుదలైంది. త‌దుప‌రి రస్సో బ్రదర్స్ వెబ్ సిరీస్ సిటాడెల్ ఇండియన్ వెర్ష‌న్ లో క‌నిపించ‌నుంది. సిటాడెల్ ప్ర‌మోష‌న్స్ లో పాల్గొనేందుకు స‌మంత రెడీ అవుతోంద‌ని స‌మాచారం. మ‌రోవైపు స‌ల్మాన్ ఖాన్ స‌ర‌స‌న స‌మంత క‌థానాయిక‌గా న‌టించే అవ‌కాశం ఉంద‌ని కూడా క‌థ‌నాలొస్తున్నాయి.