Begin typing your search above and press return to search.

సమంత లైఫ్ పాఠాలు.. ఇప్పటికీ అలా చేస్తుందట!

ఏ మాయ చేశావో చిత్రంతో అందరినీ మాయ చేసింది సమంత. ఈ మూవీలో తన యాక్టింగ్, గ్లామర్ తో మంచి గుర్తింపు సంపాదించుకుంది

By:  Tupaki Desk   |   22 March 2024 8:11 AM GMT
సమంత లైఫ్ పాఠాలు.. ఇప్పటికీ అలా చేస్తుందట!
X

ఏ మాయ చేశావో చిత్రంతో అందరినీ మాయ చేసింది సమంత. ఈ మూవీలో తన యాక్టింగ్, గ్లామర్ తో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఒక్కసారిగా ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. బృందావనం, దూకుడు మూవీ ఆఫర్లు కొట్టేసింది. వరుస మూడు హిట్లు సాధించి స్టార్ హీరోయిన్ గా అవతరించింది. ఆ తర్వాత వరుస చిత్రాలు చేస్తూ టాప్ పొజిషన్ కు చేరుకుంది. తెలుగు త్వరగా నేర్చుకుని ఇక్కడి అమ్మాయిగా మారిపోయింది.

కొన్ని నెలల క్రితం మయోసైటిస్ బారిన పడ్డ సమంత.. ప్రస్తుతం కోలుకుంది. తాను యాక్టింగ్ కు రెడీ అయ్యానని ఇటీవల తెలిపింది. ప్రస్తుతం చేతిలో సినిమాలు లేకపోయినా.. త్వరలోనే సిటాడెల్ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ.. ఎప్పటికప్పుడు తన ఫ్యాన్స్ కోసం వరుస అప్డేట్స్ ఇస్తుంటుంది. ఇటీవల పాడ్ కాస్ట్ ప్రారంభించి పలు విషయాలు మాట్లాడుతున్న సంగతి తెలిసిందే.

ఇక కొత్త పాడ్ కాస్ట్ ఎపిసోడ్ తో తాను చిన్నప్పటి నుంచి పడిన కష్టాలను గుర్తుచేసుకుంది. తాను పడ్డ బాధలను వివరించింది. చిన్నప్పటి నుంచి తనపై తానే ఎక్కువ ఒత్తిడి పెట్టుకున్నట్లు చెప్పింది. అందువల్ల చాలా ఇబ్బంది పడ్డానని పేర్కొంది. తనపై తనకు ఎక్కువ అంచనాలు ఉండేవని, అవి చాలా సార్లు నెరవేరలేదని చెప్పింది. ఆత్రుత వల్ల నిద్ర లేని రాత్రులు గడిపానని, ఆందోళన పడేదాన్ని అని తెలిపింది.

"ఆందోళన భావాన్ని భరించడం చాలా కష్టం. కొన్నేళ్ల క్రితం.. కృతజ్ఞతా భావాన్ని అలవరచుకున్నాను. రోజూ నేను కృతజ్ఞత తెలిపే విషయాలను ఒక దగ్గర రాసుకుంటాను. ఇది నన్ను ఆందోళన, ఆత్రుత భావాల నుంచి బయటపడేలా చేస్తుంది. మనం ఏదైనా పనిని వేగంగా చేస్తాం. దాని ఫలితం త్వరగా రావాలని కోరుకుంటాం. నాకు అలానే అనిపిస్తుంటుంది. అందుకోసం ఓపిగ్గా ఎలా ఉండాలో నేర్చుకున్నాను" అని సమంత తెలిపింది.

ఇవి విన్న ఫ్యాన్స్.. సమంత చాలా మంది యువతులకు స్ఫూర్తినిస్తోందని కామెంట్లు పెడుతున్నారు. ట్రోల్ చేయకుండా.. ఆమె చెప్పిన వాటిలో మంచి విషయాలు తీసుకోవాలని సూచిస్తున్నారు. జీవితంలో సవాళ్లు ఎలా అధిగమించాలో సామ్ ను చూసి నేర్చుకోవాలని అంటున్నారు. మరి సమంత.. త్వరలో సిటాడెల్ వెబ్ సిరీస్ ప్రమోషన్లలో పాల్గొని సందడి చేయనుంది. మరి బ్రేక్ తర్వాత సామ్ ఈ సిరీస్ తో ఎలాంటి హిట్ కొడుతుందో వేచి చూడాలిక.