Begin typing your search above and press return to search.

సమంత ఇక అలాంటివి చేయదా..?

సౌత్ స్టార్ హీరోయిన్ సమంత మయోసైటిస్ వల్ల రెండేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటుంది

By:  Tupaki Desk   |   15 March 2024 5:30 PM GMT
సమంత ఇక అలాంటివి చేయదా..?
X

సౌత్ స్టార్ హీరోయిన్ సమంత మయోసైటిస్ వల్ల రెండేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటుంది. తెలుగులో విజయ్ దేవరకొండతో ఖుషి సినిమా చేసిన సమంత ఆ తర్వాత మరో సినిమా సైన్ చేయలేదు. ఆమె ఓకే అంటే ఆఫర్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నా సరే సమంత మాత్రం సినిమాల విషయంలో ఆచి తూచి అడుగులేస్తుంది. సమంత ప్రస్తుతం సిటాడెల్ వెబ్ సీరీస్ చేస్తుంది. ఆ సీరీస్ తో మళ్లీ తిరిగి ఆడియన్స్ ని అలరించాలని చూస్తుంది.

సమంత నెక్స్ట్ సినిమా అప్డేట్ కోసం ఫ్యాన్స్ అంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. అయితే సమంత సినిమాల విషయంలో సీరియస్ డెసిషన్ తీసుకుందని టాక్. సమంత ఇక మీదట కమర్షియల్ సినిమాలకు నో చెప్పాలని అనుకుంటుంది. కమర్షియల్ సినిమాల్లో కేవలం సాంగ్స్ కోసం తప్ప ఈమధ్య హీరోయిన్స్ కు అంత ప్రాధాన్యత ఉండట్లేదు. అందుకే సమంత అలాంటి సినిమాలు చేయకూడదని ఫిక్స్ అయ్యిందట.

అంతేకాదు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ విషయంలో కూడా సమంత నిర్ణయం తీసుకుందని తెలుస్తుంది. ఇక మీదట అలాంటి ఐటం సాంగ్స్ ను కూడా చేయకూడదని డిసైడ్ అయినట్టు టాక్. కేవలం ఫిమేల్ సెంట్రిక్ సినిమాలతోనే ఆమె ప్రేక్షకులను మెప్పించాలని అనుకుంటుందట. సమంత ఓ పక్క కమర్షియల్ సినిమాలు చేస్తూనే మరోపక్క లేడీ ఓరియెంటెడ్ కథలను చేస్తూ వచ్చింది. యూటర్న్ నుంచి యశోద వరకు సమంత చేసిన ప్రతి అటెంప్ట్ ఆడియన్స్ ని మెప్పించింది.

అందుకే ఇక మీదట తను సోలో సినిమాలను మాత్రమే చేయాలని అనుకుంటుంది. పుష్ప 1 సినిమాలో ఉ అంటావా సాంగ్ తో అదరగొట్టిన సామ్ మరోసారి అలాంటి ఛాన్స్ వస్తే చేస్తుందని అనుకోగా కొత్తగా ఆమె తీసుకున్న నిర్ణయం వల్ల అలాంటి వాటికి సమంత ఇక దూరమే అంటూ చెప్పుకుంటున్నారు. హీరోయిన్ గా సౌత్ సినీ ప్రియులను అలరిస్తూ వచ్చిన సమంత కెరీర్ లో ఇంకా ప్రయోగాలు చేయాలని అనుకుంటుంది. ప్రస్తుతం తెలుగులో కథా చర్చలు చేస్తున్న సమంత త్వరలోనే ఒక భారీ ప్రాజెక్ట్ తో రాబోతుందని తెలుస్తుంది. సమంత నెక్స్ట్ సినిమా అప్డేట్ కోసం ఆమె అభిమానులు ఎంతో ఎగ్జైట్మెంట్ తో ఎదురుచూస్తున్నారు.