Begin typing your search above and press return to search.

మోడ్రన్ మహారాణిలా సమంత స్టన్నింగ్ లుక్

సినిమాలకి ఏడాదిపాటుగా గ్యాప్ ఇవ్వాలని డిసైడ్ అయిన ఈ బ్యూటీ ప్రస్తుతం ఎలాంటి కమిట్మెంట్ లు చేయలేదు

By:  Tupaki Desk   |   15 Aug 2023 4:08 AM GMT
మోడ్రన్ మహారాణిలా సమంత స్టన్నింగ్ లుక్
X

సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం ఖుషి మూవీ కంప్లీట్ చేసింది. సినిమాలకి ఏడాదిపాటుగా గ్యాప్ ఇవ్వాలని డిసైడ్ అయిన ఈ బ్యూటీ ప్రస్తుతం ఎలాంటి కమిట్మెంట్ లు చేయలేదు. చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ వరకు కంప్లీట్ చేసింది. ఆ మధ్య ఓ హాలీవుడ్ మూవీలో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే మాట ఆ మధ్య వినిపించింది. అయితే దీనిపై ఎలాంటి అప్డేట్ లేదు.


సినిమాల నుంచి కొంతకాలం విశ్రాంతి తీసుకోవాలని డిసైడ్ అయినా కూడా సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. తనకి సంబందించిన అన్ని అప్డేట్స్ ని పంచుకుంటుంది. ప్రస్తుతం వెకేషన్ మూడ్ ని ఎంజాయ్ చేస్తోన్న సమంత మరో విప్పు ఖుషి సినిమాని ఇన్ స్టాగ్రామ్ ద్వారా ప్రమోట్ చేసే చేస్తోంది.


అలాగే ఈ మధ్య కాస్ట్యూమ్స్ విషయంలో సమంత చాలా ప్రత్యేకత చూపిస్తుంది. రెగ్యులర్ హీరోయిన్స్ తరహాలో గ్లామర్ షోతో సమంత కనిపించడం లేదు. ఫుల్ ప్యాంట్, షర్ట్ మాత్రమే ఎలివేట్ అయ్యే విధంగా ఫుల్ డ్రెస్ వేస్తోంది. సమంత ప్రస్తుత డ్రెస్సింగ్ స్టైల్ లో మిగిలిన హీరోయిన్స్ లో ఎవరు ఫాలో కావడం లేదు.

అందాల ప్రదర్శన కంటే వ్యక్తిత్వాన్ని, కాన్ఫిడెంట్ ని ఎస్టాబ్లిష్ చేసే విధంగా సమంత కాస్ట్యూమ్స్ స్టైల్ ఉన్నాయి. ఓ విధంగా చెప్పాలంటే ఫ్యూచర్ మహారాణి తరహాలో సమంత ఈ డ్రెస్సింగ్ స్టైల్ లో దర్శనం ఇస్తోంది. తాజాగా ఆమె వైట్ కలర్ డ్రెస్ లో ఇన్ స్టాగ్రామ్ లో మెస్మరైజ్ చేస్తోంది. కళ్ళజోడు పెట్టుకొని ప్యాంట్, షర్ట్ తో టక్ వేసి స్టన్నింగ్ లుక్స్ తో కేక పుట్టిస్తోంది.


ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. సమంత షేర్ చేసిన డిఫరెంట్ డ్రెస్సింగ్ స్టైల్ ఫోటోలని ఇన్ స్టాగ్రామ్ లో ఏకంగా 4.79 లక్షల మంది లైక్ చేయడం విశేషం. సమంత ఎలాంటి కాస్ట్యూమ్ వేసిన వాటికే కొత్త అందం వస్తాయని, ఫ్యాషన్ ప్రపంచంలో ఇప్పుడు సామ్ ట్రెండ్ సెట్టర్ గా ఉందనే మాట వినిపిస్తోంది.