Begin typing your search above and press return to search.

సగం బలంతో పోరాడాల్సి వచ్చింది : సమంత

సినిమా షూటింగ్స్ కు ఏడాది బ్రేక్ తీసుకున్న సమంత తిరిగి షూటింగ్స్ కు హాజరు అయ్యేందుకు రెడీ అవుతోంది

By:  Tupaki Desk   |   28 March 2024 9:31 AM GMT
సగం బలంతో పోరాడాల్సి వచ్చింది : సమంత
X

సినిమా షూటింగ్స్ కు ఏడాది బ్రేక్ తీసుకున్న సమంత తిరిగి షూటింగ్స్ కు హాజరు అయ్యేందుకు రెడీ అవుతోంది. సినిమా షూటింగ్స్ కంటే ముందు సమంత తాను ఇప్పటికే నటించిన సిటాడెల్‌ వెబ్‌ సిరీస్ ప్రమోషన్ లో పాల్గొనబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల సిటాడెల్‌ కి సంబంధించిన ప్రమోషన్ లో సమంత పాల్గొంది.

ఆ సమయంలో సిటాడెల్‌ షూటింగ్‌ అనుభవాలను పంచుకుంది. సిటాడెల్‌ కోసం ప్రత్యేక శిక్షణ తీసుకున్నాను. ఆ సమయంలో నేను చాలా బలహీన స్థితిలో ఉన్నాను. అప్పటికే నేను చాలా వీక్ అయ్యాను. నాలో ఉన్న బలం మయోసైటిస్ వల్ల 50 శాతం కు పడిపోయింది.

ఆ యాబై శాతం బలంతోనే సిటాడెల్‌ కోసం కఠినమైన శిక్షణ తీసుకున్నట్లుగా సమంత పేర్కొంది. ఇమ్యూనిటీ లేక చాలా ఇబ్బంది పడుతున్న సమయంలో కూడా సిటాడెల్‌ షూటింగ్‌ లో పాల్గొన్నట్లుగా సమంత తెలియజేసింది. తన వీక్‌నెస్ ను ఆ సమయంలో బయటకు తెలియకుండా చూసుకున్నట్లుగా పేర్కొంది.

గత ఏడాది ఖుషి సినిమా తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సమంత త్వరలో సిటాడెల్ వెబ్‌ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ముందు ముందు వరుసగా హిందీ సినిమాల్లో నటించాలని, హిందీ వెబ్ సిరీస్ ల్లో నటించి నటిగా తనను తాను నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సన్నిహితుల వద్ద సమంత చెప్పినట్లు సమాచారం అందుతోంది.