Begin typing your search above and press return to search.

సమంత.. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు?

సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ సమంత గత ఏడాది ఖుషి మూవీతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది

By:  Tupaki Desk   |   9 April 2024 2:30 PM GMT
సమంత.. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు?
X

సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ సమంత గత ఏడాది ఖుషి మూవీతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. విజయ్ దేవరకొండకు జోడిగా నటించిన ఈ సినిమా మొదట కలెక్షన్లు బాగానే అందుకున్నా ఆ తరువాత ట్విస్ట్ ఇచ్చింది. ఈ సినిమా ఫైనల్ గా ఏవరేజ్ రిజల్ట్ తో బయటపడింది. మాయోసైటిస్ నుంచి పూర్తిగా కోలుకోవడానికి సమంత ఖుషి తర్వాత కొంతకాలం సినిమాలకి విరామం ఇచ్చింది.

మానసికంగా, శారీరకంగా సిద్ధం అయిన తర్వాత మళ్ళీ నటనపై దృష్టి పెట్టాలని భావించింది. ఈ ఏడాదిలో తిరిగి యాక్టర్ గా బిజీ అయ్యే ప్రయత్నం సమంత చేస్తోంది. ఇప్పటికే రాజ్ అండ్ డీకేతో కలిసి సిటాడెల్ హాన్నీ బన్నీ వెబ్ సిరీస్ కంప్లీట్ చేసిన సామ్ రిలీజ్ కోసం వెయిట్ చేస్తోంది. ఈ వెబ్ సిరీస్ బాలీవుడ్ లో తనకి అవకాశాలు తెచ్చిపెడుతుందని సమంత చాలా నమ్మకంగా ఉంది.

సౌత్ సినిమాలపై ఈ బ్యూటీ ఫోకస్ తగ్గించి బాలీవుడ్ పైనే ఎక్కువ దృష్టి పెట్టింది. బాలీవుడ్ లో బిజీ అయితే అనంతరం సౌత్ లో కూడా మరిన్ని అవకాశాలు అందుకోవచ్చు అనే ఆలోచనతో సమంత ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక చాలా రోజుల నుంచి ఆమె బాలీవుడ్ లో ఒక స్టార్ తో మూవీ చేయబోతోందనే ప్రచారం అయితే నడుస్తోంది. అక్షయ్ కుమార్ సమంతని బాలీవుడ్ కి పరిచయం చేయబోతున్నాడు అని కథనాలు వినిపించాయి.

అలాగే ఆయష్మాన్ ఖురానాతో సమంత ఒక మూవీ ఒకే అయ్యిందని సోషల్ మీడియాలో టాక్ వినిపించింది. అయితే వీటిలో ఏది కూడా కార్యరూపం దాల్చలేదు. అయితే సమంత ఇన్ స్టాగ్రామ్ లో మాత్రం రెగ్యులర్ గా హాట్ ఫోటోషూట్ లు షేర్ చేస్తూ బాలీవుడ్ జనాలను సైతం ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. ఇక అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కబోయే పాన్ ఇండియా మూవీలో సమంత హీరోయిన్ గా ఖరారైందనే మాట వినిపిస్తోంది.

ఇదే కనుక వాస్తవం అయితే కచ్చితంగా సమంతకి పాన్ ఇండియా రేంజ్ లో మంచి ఇమేజ్ రావడానికి స్కోప్ ఉంటుంది. మరి ఈ లోపు ఏవైన హిందీ ప్రాజెక్ట్స్ ని సమంత అఫీషియల్ గా ఎనౌన్స్ చేస్తుందేమో అనేది వేచి చూడాలి. ది ఫ్యామిలీ మెన్ 2తో డిజిటల్ స్పేస్ లో ఇప్పటికే సమంత సక్సెస్ అయ్యింది. సిటాడెల్ వర్క్ అవుట్ అయితే ఓటీటీలో సమంత యాక్షన్ హీరోయిన్ గా ఎస్టాబ్లిష్ అయ్యే ఛాన్స్ ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి అది ఎంత వరకు సాధ్యం అవుతుందనేది తెలియాల్సి ఉంది.