Begin typing your search above and press return to search.

సామ్‌ సైలెంట్‌ గా అక్కడికి షిప్ట్‌ అవుతుందా...?

టాలీవుడ్ స్టార్‌ హీరోయిన్‌ సమంత అనారోగ్య సమస్యల కారణంగా ఏడాది పాటు సినిమాలకు, షూటింగ్స్ కు బ్రేక్ తీసుకున్న విషయం తెల్సిందే

By:  Tupaki Desk   |   26 March 2024 5:36 AM GMT
సామ్‌ సైలెంట్‌ గా అక్కడికి షిప్ట్‌ అవుతుందా...?
X

టాలీవుడ్ స్టార్‌ హీరోయిన్‌ సమంత అనారోగ్య సమస్యల కారణంగా ఏడాది పాటు సినిమాలకు, షూటింగ్స్ కు బ్రేక్ తీసుకున్న విషయం తెల్సిందే. గత ఏడాది నుంచి విశ్రాంతి తీసుకుంటూ విదేశాల్లో చక్కర్లు కొడుతున్న సమంత తిరిగి షూటింగ్స్ కు హాజరు అయ్యేందుకు రెడీ అవుతున్నట్లు ఆమె సన్నిహితుల ద్వారా తెలుస్తోంది.

సమంత ఇప్పటికే నటించిన సిటాడెల్‌ వెబ్‌ సిరీస్‌ విడుదలకు సిద్ధం అవుతోంది. ఆ వెబ్ సిరీస్ తర్వాత హిందీలో వరుసగా సమంత సినిమాలు చేసేందుకు గాను రెడీ అవుతుందని వార్తలు వస్తున్నాయి. ముంబై లో సమంత ప్రస్తుతం ఒక మంచి ఇంటిని కొనుగోలు చేయడం లేదా అద్దెకు తీసుకోవడం కోసం సెర్చింగ్‌ లో ఉందట.

ముంబైకి చెందిన ఆమె సన్నిహితులు ఇంటి విషయంలో ఆమెకు సహాయం చేస్తున్నారు. సౌత్‌ లో ఆమె ఓకే అనాలే కానీ ఒకే సారి నాలుగు అయిదు ఆఫర్లు వస్తాయి. కానీ సామ్‌ మాత్రం సైలెంట్‌ గా ముంబై చెక్కేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆమె సన్నిహితులు మాట్లాడుకునే విషయాలను బట్టి అర్థం అవుతుంది.

పర్సనల్‌ ప్రాబ్లమ్స్ మరియు బాలీవుడ్‌ లో దక్కిన గుర్తింపు కారణంగా ఇకపై పూర్తిగా హిందీ సినిమా ఇండస్ట్రీలోనే సినిమాలు చేయాలనే నిర్ణయానికి సమంత వచ్చిందనే టాక్‌ వినిపిస్తుంది. అయితే సామ్‌ నటించిన ప్రతి హిందీ సినిమా కూడా సౌత్ లోని అన్ని భాషల్లో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.

తెలుగు మరియు తమిళంలో స్టార్‌ స్టేటస్ ఉన్న సమంత ఇక్కడి ఆఫర్లను తిరస్కరించడం విడ్డూరంగా ఉందంటూ కొందరు విమర్శలు చేస్తూ ఉంటే మరి కొందరు మాత్రం ఆమె బాలీవుడ్‌ కి పరిమితం అవ్వడం ఏమాత్రం కరెక్ట్‌ కాదంటూ సూచిస్తున్నారు. సమంత మాత్రం ఇప్పటి వరకు అఫిషియల్ గా ఏ విషయాన్ని వెళ్లడించలేదు.