Begin typing your search above and press return to search.

స‌మంత అవంటే భ‌య‌ప‌డుతుంది..!

స‌మంత‌ను భ‌య‌పెడుతున్న అవేంటో తెల్సా? చాలా కాలంగా మ‌యోసైటిస్ త‌న‌ను చాలా విధాలుగా భ‌య‌పెట్టింది

By:  Tupaki Desk   |   14 Jan 2024 12:37 PM GMT
స‌మంత అవంటే భ‌య‌ప‌డుతుంది..!
X

స‌మంత‌ను భ‌య‌పెడుతున్న అవేంటో తెల్సా? చాలా కాలంగా మ‌యోసైటిస్ త‌న‌ను చాలా విధాలుగా భ‌య‌పెట్టింది. అయినా మొక్క‌వోని ధీక్ష‌, క‌ఠినమైన వ్యాయామాలు, క్ర‌మ‌శిక్ష‌ణ‌తో అన్నిటినీ దారికి తెస్తోంది. ప్ర‌తికూల ప‌రిస్థితుల్లో సానుకూల ప్ర‌వ‌ర్త‌న‌, ఆలోచ‌నా తీరుతో ఉత్త‌మ ఫ‌లితాన్ని రాబ‌డుతోంది సామ్. స‌మంత ప‌ట్టుద‌ల ధీక్ష అంద‌రిలో స్ఫూర్తిని నింపుతోంది. వ్య‌క్తిగ‌త‌, వృత్తిగ‌త జీవితంతో సామ్ పోరాటం అంద‌రినీ మేల్కొలుపుతోంది.


కొత్త సంవ‌త్స‌రంలో ప్ర‌వేశిస్తున్న వేళ విదేశాల్లో సెల‌బ్రేష‌న్ కి వెళ్లిన స‌మంత ఇంత‌లోనే ఇప్పుడు ఒక కొత్త విష‌యం చెప్పింది. త‌న‌కు పువ్వులు అంటే అలెర్జీ అని, వాటిని అందుకోవడం అంటే భయపెడుతుంద‌ని అంది. త‌న‌ ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో పూల గుత్తిని అందుకున్న సంతోషకరమైన సంద‌ర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఆ ఫోటోను అభిమానుల కోసం షేర్ చేసింది. అదే సమయంలో పువ్వుల‌తో త‌న‌కు ఉన్న స‌మ‌స్య గురించి ప్ర‌స్థావించింది. అవే పువ్వుల వ‌ల్ల తాను అత్యవసర గదిలో చికిత్స పొందాల్సిన ప‌రిస్థితికి దారితీసిందని కూడా ఆమె వెల్లడించింది. ఈ ఫోటోకి క్యాప్షన్ ఇలా ఉంది. ''మీరు ఈ అందమైన వస్తువులను ఇష్టపడినప్పుడు మిశ్రమ భావాలు ఉన్నాయి.. కానీ AF భయపెడుతున్నాయి.. ఎందుకంటే చివరిసారి మీరు (పుష్పాలు) న‌న్ను అత్యవసర గదికి పంపారు. పువ్వులతో నరకం ఎవరికి ఇష్టం?!''అని క్యాప్ష‌న్ లో రాసింది సామ్.

సమంత ప్రస్తుతం నటనకు విరామం ఇచ్చి మైయోసైటిస్ అనే ఆటో ఇమ్యూన్ కండిషన్ కి చికిత్స పొందుతోంది. ఇటీవలి ఇంటర్వ్యూలో త‌న‌పై ఆన్‌లైన్ ప్రతికూలత గురించి ఓపెన‌వుతూ.. సోషల్ మీడియాలో తన నిజమైన స్వీయ బలహీనతలు, బలాలను తెలియ‌జేసినందుకు ట్రోలింగుకి గుర‌య్యాన‌ని స‌మంత గుర్తుచేసుకుంది. ''ఇది అంత సులభం కాదు, కానీ నేను సోషల్ మీడియాతో నా సంబంధంలో ఒక మధురమైన స్థానానికి చేరుకున్నాను. నేను నిజాయితీగా బలహీనతలు, బలాలు ఉన్నవన్నీ చూపించడం నాకు చాలా సంతృప్తినిస్తోంది. అయితే నేను చెప్పిన లేదా తప్పుగా పోస్ట్ చేసినది పేలినప్పుడు నేను మరొక ట్రోలింగ్ ఫెస్ట్‌కి లక్ష్యంగా మారాను. నేను నా మనసు మార్చుకుని ఉండవచ్చు, కానీ ప్రస్తుతానికి ఇది ఒక స్వీటెస్ట్ ప్లేస్''అని వ్యాఖ్యానించింది.

సమంత రూత్ ప్రభు మయోసైటిస్ కి చికిత్స తీసుకుని ఇప్పుడు రెట్టించిన ఉత్సాహంతో సినిమాల్లో న‌టించేందుకు సిద్ధ‌మ‌వుతోంది. త‌దుప‌రి భారీ ప్రాజెక్ట్‌లతో అల‌రించేందుకు సిద్ధంగా ఉంది. ఈ సంవ‌త్స‌రంలో దేవ‌ర‌కొండ స‌ర‌స‌న ఖుషి చిత్రంలో న‌టించిన స‌మంత ఓటీటీ కోసం సిటాడెల్ భార‌తీయ వెర్ష‌న్ లో వ‌రుణ్ ధావ‌న్ స‌ర‌స‌న న‌టించిన సంగ‌తి తెలిసిందే. 'ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2'లో నటించిన సామ్ మ‌రోసారి డైనమిక్ డైరెక్టర్ ద్వయం రాజ్ అండ్ డికెతో క‌లిసి ప‌ని చేసింది. కొత్త సంవ‌త్స‌రంలో సిటాడెల్ కోసం ప్ర‌చారానికి స‌మంత సిద్ధ‌మ‌వుతోంద‌ని స‌మాచారం. త‌దుప‌రి కొన్ని ప్రాజెక్టుల గురించి స‌మంత స్వ‌యంగా ప్ర‌క‌టించే అవ‌కాశం ఉందని టాక్ వినిపిస్తోంది.