Begin typing your search above and press return to search.

సిటాడెల్ ప్ర‌చారం లాంచింగులు 2024లో?

సమంత రూత్ ప్రభు ప్ర‌స్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. త‌న ఆరోగ్యంపైనే పూర్తి దృష్టి పెట్టారు

By:  Tupaki Desk   |   19 Dec 2023 2:45 AM GMT
సిటాడెల్ ప్ర‌చారం లాంచింగులు 2024లో?
X

సమంత రూత్ ప్రభు ప్ర‌స్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. త‌న ఆరోగ్యంపైనే పూర్తి దృష్టి పెట్టారు. గత సంవత్సరం ఆటో ఇమ్యూన్ కండిషన్ మైయోసిటిస్‌తో బాధపడుతున్నాన‌ని ప్ర‌క‌టించిన త‌ర్వాత చికిత్స కోసం దేశ విదేశాల్లో నిపుణుల‌ను క‌లిసిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం విజ‌య‌వంతంగా చికిత్స‌ కొన‌సాగుతోంది. వరుణ్ ధావన్‌తో కలిసి రాజ్ & DK ఇండియా వెర్స‌న్ 'సిటాడెల్‌' చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసి, ఖుషీ పెండింగ్ చిత్రీక‌ర‌ణ‌ను అప్ప‌ట్లో ముగించింది. కానీ ఆ త‌ర్వాత పూర్తిగా సినిమా షూటింగుల‌కు దూర‌మైంది.

తాజా స‌మాచారం మేర‌కు.. సమంత రూత్ ప్రభు ఇటీవ‌ల మేలైన చికిత్స‌తో ఫిట్నెస్ ట్రీట్ మెంట్ తో రీఛార్జ్ అయి క‌నిపిస్తోంది. సామ్ ఆరోగ్యం ఇప్పుడు చాలా మెరుగ్గా ఉంది. ఆమె మానసిక స్థితిని ఆరోగ్యాన్ని వివరించడానికి 'పునరుజ్జీవనం' అనేది సరైన పదం. ఎనర్జీని తిరిగి పొందుతూ ఉంటే, ఆరోగ్యం మెరుగ‌వుతుంటే ఉత్సాహం త‌న‌లో క‌నిపిస్తోంది. అలాగే జిమ్ యోగాతో ప్ర‌యాణం.. ప్రపంచవ్యాప్తంగా ఆహ్లాద‌క‌ర‌మైన ప్రాంతాల్లో విహ‌రించ‌డం త‌న‌కు రిలాక్స్ అయ్యేందుకు అవ‌కాశం క‌ల్పించాయి. ఇప్పుడు తన పనిలో శక్తిని పొంద‌డానికి ప్లాన్ చేస్తోంది.

కొత్త‌ ఏడాది ప్రారంభంలో తిరిగి సెట్‌లోకి రావాలని స‌మంత‌ యోచిస్తోంది. నిజానికి న‌ట‌న‌తో పున‌రుత్తేజం కోసం సామ్ చాలా ఎదురుచూస్తోంది. సిటాడెల్ ప్రమోషన్‌లు ప్రారంభమైనప్పుడు తిరిగి పనిలోకి వస్తుందని భావిస్తున్నారు. అదే స‌మ‌యంలో కొత్త ప్రాజెక్ట్‌ను కూడా ప్రారంభించవచ్చు. గ‌త‌ ఆదివారం సమంత రూత్ ప్రభు తన అభిమానుల కోసం కొంత సమయాన్ని కేటాయించారు. త‌న‌ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఏదైనా అడగండి? సెషన్‌లో ఫ్యాన్స్ ప్రశ్నలకు ప్రతిస్పందించింది. అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఒక నెటిజ‌న్ ''మళ్లీ పెళ్లి చేసుకోవడం గురించి ఆలోచించలేదా?'' అని అడిగారు. ఆమె నవ్వుతున్న ఎమోజీని జోడించి ''గణాంకాల ప్రకారం చెడ్డ‌ పెట్టుబడి అవుతుంది'' అని చెప్పింది. ఇదే పోస్ట్‌లో విడాకుల రేటింగ్ డేటాను కూడా జోడించింది.

సమంత రూత్ ప్రభు గ‌తంలోను తన బహిరంగ విడాకుల గురించి అరుదైన వ్యాఖ్య చేసింది. 2021లో విడాకులు అత్యంత చర్చనీయాంశంగా మారాయి. ఈ సంవత్సరం ప్రారంభంలోనే నాగ చైతన్య వారి విడాకులను ధృవీకరించారు. విడిపోవడానికి గల కారణాన్ని గురించి సమంతా - చైతన్య పెదవి విప్పకుండా ఉన్నప్పటికీ విఫలమైన వివాహం అనంత‌రం మైయోసిటిస్ అనే ఆటో-ఇమ్యూన్ పరిస్థితి, ఫ్లాప్ సినిమాలు ముమ్మాటికి త‌న‌ను కొంత బాధించాయని సమంత తెలిపింది.

ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ సమంత తన అభిమానులు తన జ‌యాప‌జ‌యాలు ఒడిదుడుకుల్లో భాగమని నిర్థారించింది. విఫలమైన వివాహం, నా ఆరోగ్య ప‌రిస్థితి.. చేసే పని దెబ్బతిన‌డం ఇవ‌న్నీ ట్రిపుల్ వామ్మీ లాంటిది. అయితే గత రెండు సంవత్సరాలుగా నేను భరించిన దానికంటే చాలా తక్కువగా ప్రజలు దిగజారుతున్నారు. ఆ సమయంలో నేను ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నప్పుడు ట్రోలింగ్ లేదా ఆందోళనకు గురైన అబిమానుల‌ గురించి చదివాను. వారి ఆద‌రాభిమానాల‌కు సంబంధించిన కథలు చదవడం నాకు సహాయపడింది. వారు అలా చేస్తే, నేను కూడా తిరిగి రెట్టించిన ఉత్సాహంతో ప‌ని చేయగలనని తెలుసుకోవడం నాకు బలాన్ని ఇచ్చింది.. అని స‌మంత తెలిపారు.