Begin typing your search above and press return to search.

హీటెక్కించడంలో సామ్ తరువాతే ఎవరైనా..

సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ గా తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్న అందాల భామ సమంత

By:  Tupaki Desk   |   10 Nov 2023 11:40 AM GMT
హీటెక్కించడంలో సామ్ తరువాతే ఎవరైనా..
X

సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ గా తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్న అందాల భామ సమంత. ఈ ఏడాది శాకుంతలం, ఖుషి సినిమాలతో సమంత ప్రేక్షకుల ముందుకి వచ్చింది. వీటిలో శాకుంతలం డిజాస్టర్ కాగా, ఖుషి మూవీ ఎవరేజ్ టాక్ తో సరిపెట్టుకుంది. గత ఏడాది మాయోసైటిస్ బారిన పడి ట్రీట్మెంట్ తీసుకున్న సామ్ పూర్తిగా కోలుకోకుండానే ఈ సినిమాలు ఫినిష్ చేసింది.


ప్రస్తుతం సినిమాలకి విరామం ఇచ్చి సమంత రెస్ట్ తీసుకుంటుంది. మరో వైపు ఫిజికల్ గా మరింత ఫిట్ అయ్యేందుకు ప్రయత్నం చేస్తోంది. దానికోసం కఠినమైన మెడిటేషన్, ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ లు తీసుకుంటుంది. మరో వైపు ఛాన్స్ దొరికిన ప్రతిసారి గ్లామర్ ఫోటోషూట్ లని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ఫ్యాన్స్ తో పంచుకుంటుంది. డిఫరెంట్ మేకోవర్స్ తో తనని తాను కొత్తగా రిప్రజెంట్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది.


సమంతకి ఇన్ స్టాగ్రామ్ లో మిలియన్స్ లో ఫాలోవర్స్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ కారణంగా ఆమె ఎలాంటి ఫోటో పెట్టిన దానికి లక్షల్లో లైక్స్ వస్తూ ఉంటాయి. తాజాగా వైట్ కలర్ కాస్ట్యూమ్స్ తో నిండుగా అందాలతో పాలరాతి శిల్పంలా సమంత తనని తాను షోకేస్ చేసుకుంది. ఈ ఫోటోలని 6 లక్షలకి పైగా ఫ్యాన్స్ లైక్ చేశారు. బుల్గారి జ్యూయిలరీని ధరించి సమంత షేర్ చేసిన హాట్ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ ఫోటోలకి సమంత అదిరిపోయే క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఫ్యాన్స్ కి దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ పండగని గట్టిగా కౌగిలించుకోవడానికి బుల్గారితో ఆహ్వానం పలుకుదాం అంటూ పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు చూసిన తర్వాత అందం, ఆకర్షణలో సమంతని కొట్టేవారే లేరనే మాట ఆమె అభిమానుల నుంచి వినిపిస్తోంది. అలాగే ఆ ఫోటోకి నెటిజన్లు నుంచి భిన్నమైన కామెంట్స్ వినిపిస్తున్నాయి.

సమంత శారీ కట్టుకుంటేనే బాగుంటుంది, ఇలాంటి డ్రెస్ లో బాగోలేదు అనే కొంతమంది నెటిజన్లు కామెంట్స్ చేయగా, సమంత ఎలాంటి కాస్ట్యూమ్ వేసిన ఆ దుస్తులకే అందం వస్తుందని అభిమానులు పోస్టులు పెడుతున్నారు. వీటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.