Begin typing your search above and press return to search.

సమంత.. పొగలు కక్కే చలిలో అలా..

స్టార్ హీరోయిన్ సమంత చాలా కాలం నుంచి మయోసైటిస్‌ అనే ఆటో ఇమ్యూనీ వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   4 Nov 2023 8:05 AM GMT
సమంత.. పొగలు కక్కే చలిలో అలా..
X

స్టార్ హీరోయిన్ సమంత చాలా కాలం నుంచి మయోసైటిస్‌ అనే ఆటో ఇమ్యూనీ వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. అయినా ఒక వైపు ఈ వ్యాధికి సంబంధించిన చికిత్స తీసుకుంటూనే మరోవైపు సినిమాలు, వెబ్‌సిరీస్‌ల్లో నటిస్తూ వచ్చింది. అయితే కొద్ది రోజుల క్రితం నుంచి మాత్రం సినిమాలకు బ్రేక్​ ఇచ్చి కేవలం ఆరోగ్యం, మానసిక ప్రశాంతతపైనే దృష్టి పెట్టింది.

ఈ క్రమంలోనే తాజాగా తన ఆరోగ్యానికి సంబంధించిన ఓ చిన్న అప్డేట్​ను సోషల్​ మీడియాలో తన అభిమానులతో పంచుకుంది సామ్​. కైరో థెరపీ సెషన్‌కు హాజరైనట్లు చెప్పింది. ఈ మేరకు తన ఇన్‌స్టా స్టేటస్‌లో ఓ ఫొటోను షేర్‌ చేసింది. అందులో ఆమె పొగలు కక్కే -150 డిగ్రీల ఫారెన్​ హీట్​లో ఓ టబ్​లో కూర్చొని ఉంది.

మానవ శరీరంలో బలహీనపడిన ఇమ్యూనిటీ సిస్టమ్‌ను సమర్థంగా పని చేయించడంతో పాటు, ఇతర వ్యాధుల కారణంగా ఇన్‌ఫెక్షన్‌ బారినపడకుండా ఈ థెరపీ సహాయపడుతుందని రాసుకొచ్చింది. "ఇన్​ఫెక్షన్స్​తో పోరాడే వైట్ బ్లడ్ సెల్స్​ను పెంచుతుంది. బ్లడ్ ఫ్లో అయ్యేలా చేసి, శరీరం మొత్తం హీలింగ్ కాంపౌండ్స్​ను సరఫరా చేస్తుంది. మెంటల్ హెల్త్, ఎనర్జీని ఇస్తుంది. శరీరంలో ఎన్నో మార్పులు చేసి మంచి ఆరోగ్యాన్ని అందిస్తుంది" అని రాసుకొచ్చింది.

అలానే సామ్​ క్రమం తప్పకుండా వ్యాయామాలు కూడా చేస్తూ వాటికి సంబంధించిన ఫొటోలను కూడా పోస్ట్ చేస్తోంది. దీంతో పాటే తన హాట్ ఫొటోషూట్స్​ను కూడా షేర్ చేస్తూ తన ఫాలోవర్స్​ను కవ్విస్తూనే అలరిస్తోంది. అవి నెట్టింట్లో బాగా చక్కర్లు కొడుతుంటాయి.

ఇక సమంత సినిమాల విషయానికొస్తే.. ఆ మధ్య విజయ్‌ దేవరకొండతో కలిసి ఖుషి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాగా అది భారీ వసూళ్లను అందుకోకపోయినా.. డీసెంట్​ టాక్​ను అందుకుంది. త్వరలోనే వరుణ్‌ ధావన్‌తో కలిసి చేసిన సిటాడెల్‌ ఇండియన్ వెర్షన్​ వెబ్‌సిరీస్‌తో పలకరించనుంది. రుస్సో బ్రదర్స్‌ దీన్ని నిర్మించగా, రాజ్‌ అండ్‌ డీకే భారతీయ ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా మార్పులు చేసి తెరకెక్కించారు. త్వరలోనే సల్మాన్​ ఖాన్​తో కలిసి హిందీలో ఓ సినిమా చేయనున్నట్లు వార్తలు వచ్చాయి.