Begin typing your search above and press return to search.

లేడీ బ్రూస్ లీలా కనిపిస్తోన్న సమంత

సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న అందాల భామ సమంత

By:  Tupaki Desk   |   24 Oct 2023 11:04 AM GMT
లేడీ బ్రూస్ లీలా కనిపిస్తోన్న సమంత
X

సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న అందాల భామ సమంత. ఈ అమ్మడు ఇండస్ట్రీలోకి వచ్చి దశాబ్దానికి పైగా అయిపొయింది. ఇప్పటికి ఆమె తన బ్రాండ్ ఇమేజ్ ని ఇంకా కొనసాగిస్తూనే ఉంది. ఇదిలా ఉంటే గత ఏడాది మయోసైటిస్ బారిన పడిన సమంత ట్రీట్మెంట్ తీసుకొని మెల్లగా కోలుకుంది.


మయోసైటిస్ బారి నుంచి కోలుకొని వచ్చిన తర్వాత యశోదతో సూపర్ హిట్ కొట్టిన శాకుంతలంతో పాన్ ఇండియా లెవల్ లో తనని షోకేస్ చేసుకున్న మూవీ డిజాస్టర్ అయ్యింది. తాజాగా విజయ్ దేవరకొండకి జోడీగా ఖుషి మూవీతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ సినిమా ఎవరేజ్ టాక్ తో బయటపడింది. ఖుషి తర్వాత ఏడాది పాటు సినిమాలకి విరామం ఇవ్వాలని సమంత ఫిక్స్ అయ్యింది.

ప్రస్తుతం అయితే ఎలాంటి కమిట్మెంట్స్ పెట్టుకోలేదు. ఒప్పుకున్న సినిమాలు వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది. కొద్ది రోజులు వెకేషన్స్ కి వెళ్లి ప్రకృతి అందాలని ఆశ్వాదించిన అమ్మడు ప్రస్తుతం యూఎస్ లో రెస్ట్ తీసుకుంటోంది. అక్కడ ఓ వైపు మెడికేషన్ తీసుకుంటూనే మరో వైపు ఫిట్ నెస్ ఫ్రీక్ అయిన సామ్ రెగ్యులర్ వర్క్ అవుట్స్ తో మునుపటి శక్తిని తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది.

తాజాగ ఈ బ్యూటీ ఇన్ స్టాగ్రామ్ లో జిమ్ లో వర్క్ అవుట్ చేసిన పిక్ ని షేర్ చేసింది. ఈ ఫోటోలో సమంత చూడటానికి పెర్ఫెక్ట్ బాడీతో లేడీ బ్రూస్ లీలా ఉందనే మాట వినిపిస్తోంది. సిటాడెల్ వెబ్ సిరీస్ చేస్తోన్న ఈ బ్యూటీ అందులో యాక్షన్ సీక్వెన్స్ కోసం తన బాడీ, లుక్ కూడా మార్చుకుంటుంది. అందుకే జిమ్ లో బరువులు ఎత్తుతూ కండలు పెంచుతుంది.

టోపీ పెట్టుకొని తన స్మైలీ పేస్ తో ఓ వైపు కుర్రాళ్ళు మనసులు కొల్లగోడుతూనే మరో వైపు పెర్ఫెక్ట్ జిమ్ బాడీతో అందరిని భయపెడుతోంది. సమంత జిమ్ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.