Begin typing your search above and press return to search.

వావ్ సామ్.. ఎంత అందంగా ఉందో..

హీరోయిన్ సమంత సినిమాలకు ఏడాది పాటు బ్రేక్ ప్రకటించిన తర్వాత తన మయోసైటిస్ చికిత్స కోసం అలాగే తన సంపూర్ణ ఆరోగ్యం కోసం జీవితాన్ని ప్రశాంతంగా గడుపుతోంది

By:  Tupaki Desk   |   30 Sep 2023 11:01 AM GMT
వావ్ సామ్.. ఎంత అందంగా ఉందో..
X

హీరోయిన్ సమంత సినిమాలకు ఏడాది పాటు బ్రేక్ ప్రకటించిన తర్వాత తన మయోసైటిస్ చికిత్స కోసం అలాగే తన సంపూర్ణ ఆరోగ్యం కోసం జీవితాన్ని ప్రశాంతంగా గడుపుతోంది. మనసు ప్రశాంతత కోసం తన కిష్టమైన ప్రదేశాలను చూసేందుకు దేశాలను చుట్టేస్తోంది. అలా ఓ వైపు మెడిసిన్ వాడుతూనే మరోవైపు మనసు ఉల్లాసంగా ఉండేందుకు ప్రకృతిని ఆస్వాదిస్తోంది.

కోయంబత్తూర్ ఈషా ఫౌండేషన్​తో తన జర్నీని ప్రారంభించి.. ఆ తర్వాత ఇండోనేషియాలోని బాలి, అమెరికా న్యూయార్క్ ఇలా వరుసగా తిరిగేస్తోంది. రీసెంట్​గా ఓ వారం క్రితం ఆస్ట్రియా దేశానికి వెళ్ళింది. ప్రస్తుతం అక్కడే ఉంటూ అక్కడి ప్రదేశాలను సందరిస్తూ ఎంజాయ్ చేస్తోంది. అక్కడ దిగిన ఫొటోలను.. ఎప్పటికప్పుడు తన సోషల్​ మీడియా ఇన్‌స్టాగ్రామ్​లో పోస్ట్ చేసి అభిమానులతో పంచుకుంటోంది.

తాజాగా ఆస్ట్రియాలో సైకిల్ తొక్కుతూ షికార్లు కొట్టింది. ఆస్ట్రియాలోని సెల్జ్ బర్గ్ అనే నగరాన్ని సందర్శించిన సమంత అక్కడే ఉన్న ఓ సరస్సు పక్కన రోడ్డుపై సైకిల్ తొక్కుతూ ప్రకృతిని ఆస్వాదించింది. అలా సైకిల్ తొక్కుతున్న వీడియోలతో పాటు పలు ఫోటోలను షేర్ చేసింది. సరస్సు పక్కనే కూర్చొని ప్రకృతిలో సేద తీరింది. ఇంకా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఆస్ట్రియాలో జరిగే ఓ బాడీ పెయింటింగ్ కార్యక్రమానికి వెళ్లి దిగిన పిక్స్​ను షేర్ చేసింది.

ఇక సమంత సినిమాల విషయానికొస్తే... రీసెంట్​గా విజయ్‌ దేవరకొండతో కలిసి ఆమె నటించిన ఖుషి చిత్రం ఇటీవలే విడుదలై మంచి టాక్​ను తెచ్చుకుంది. ఇక రాజ్‌ అండ్‌ డీజే దర్శకత్వంలో సామ్‌ నటించిన సీటాడెల్‌ ఇండియన్ వెర్షన్ వెబ్​సిరీస్​ విడుదలకు సిద్ధం అవుతోంది. ప్రముఖ ఓఓటీటీ అమెజాన్ ప్రైమ్​ దీన్ని నిర్మించింది. ఇక తన విరామం పూర్తైన తర్వాత.. బాలీవుడ్​లో సల్మాన్ ఖాన్ సరసన నటించేందుకు గ్రీన్ సిగ్నల్​ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.