Begin typing your search above and press return to search.

టీనేజ్ తప్పులు.. సామ్ ఏమందంటే..

సమంత ఎక్కడున్న సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకి సంబందించిన విషయాలని అభిమానులతో పంచుకుంటుంది

By:  Tupaki Desk   |   20 Sep 2023 4:22 AM GMT
టీనేజ్ తప్పులు.. సామ్ ఏమందంటే..
X

సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ గా తిరుగులేని ఇమేజ్ తో దూసుకుపోతున్న అందాల భామ సమంత. ఈ బ్యూటీ చివరిగా ఖుషి సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ చిత్రం ఏవరేజ్ టాక్ సొంతం చేసుకుంది. థియేటర్స్ లో ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాలేదు. ప్రస్తుతం సినిమాలకి విరామం ఇచ్చిన సమంత వెకేషన్స్ ని ఆశ్వాదిస్తోంది. వరుసగా విదేశీ పర్యటనలు పెట్టుకొని అన్ని దేశాలు తిరిగేస్తోంది.

సమంత ఎక్కడున్న సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకి సంబందించిన విషయాలని అభిమానులతో పంచుకుంటుంది. ఫోటోలని షేర్ చేస్తూ తాను ఎక్కడున్నది చెబుతూ ఉంటుంది. అప్పుడప్పుడు ఫ్యాన్స్ తో వీడియో చాట్ లో ముచ్చట్లు పెడుతూ ఉంటుంది. అభిమానులు అడిగే ప్రశ్నలకి ఓపిగ్గా సమాధానాలు కూడా చెబుతూ ఉంటుంది.

తాజా మరోసారి ఆమె ఇన్ స్టాగ్రామ్ ద్వారా లైవ్ లోకి వచ్చారు. అభిమానులతో ముచ్చటించారు. ఇందులో భాగంగా అభిమానులు అడిగే వాటికి సమాధానాలు చెప్పింది. అభిమానులకి వినాయకచవితి విషెష్ చెప్పిన సమంత తన నెక్స్ట్ టూర్ ఆస్ట్రియా అని చెప్పుకొచ్చింది. సినిమాల గురించి ఓ అభిమాని అడగ్గా, ఇప్పట్లో సినిమా ఉండదని, ప్రస్తుతానికి ఎలాంటి కమిట్మెంట్స్ పెట్టుకోలేదని సమంత క్లారిటీ ఇచ్చారు.

ఇక ఓ అభిమాని తన స్కిన్ టోన్ గురించి అడగగా వీడియో ఫిల్టర్ లో ఉందని, ప్రస్తుతం తన స్కిన్ బాగోలేదని, స్టెరాయిడ్స్ ఎక్కువగా తీసుకోవడం వలన స్కిన్ టోన్ పూర్తిగా పాడైపోయిందని చెప్పుకొచ్చింది. ఈ జనరేషన్ టీనేజర్స్ లో మీరు ఎలాంటి మెసేజ్ ఇస్తారని ఓ అభిమాని చివరిగా క్వశ్చన్ చేశారు. దానికి సమంత అదిరిపోయే రేంజ్ లో సమాధానం చెప్పింది. చాలా మంది టీనేజర్స్ ఎప్పుడు చెప్పే మాట నా జీవితం అయిపొయింది. ఇలాంటి వరస్ట్ పరిస్థితి నా జీవితంలో ఎప్పుడూ రాలేదు అంటూ ఉంటారు.

నిజానికి మన అసలైన జీవితం టీనేజ్ లోనే స్టార్ట్ అవుతోంది. ఇంకా ఎదుర్కోవాల్సిన సమస్యలు చాలా ఉంటాయి. కొన్ని సార్లు మీలో ఉన్న ధైర్యం, శక్తి మీకు తెలియదు. సందర్భాన్ని బట్టి అవి బయటకొస్తాయి. 25 ఏళ్ళ వయస్సులో నేను స్ట్రాంగ్ గా ఉన్నా కాబట్టి ఈ రోజు ఈ పొజిషన్ లో ఉన్నారు. ఎట్టి పరిస్థితిలో కూడా జీవితం కోల్పోయినట్లు ఉండకూడదు. నెవర్ గివ్ అప్ మైండ్ సెట్ తో ముందుకి వెళ్ళాలి. ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. దానికోసం మనకి మనం స్ట్రాంగ్ గా ఉండాలి అని సమంత అదిరిపోయే మెసేజ్ ఇవ్వడం విశేషం.