Begin typing your search above and press return to search.

నిప్పు లేనిదే పొగ రాదు.. అత‌డితో సామ్?

స‌ల్మాన్ భాయ్ స‌ర‌స‌న స‌మంత న‌టించ‌డం ఖాయ‌మైన‌ట్టేన‌ని గ‌త కొంత‌కాలంగా బాలీవుడ్ మీడియాలో ఒక‌టే ఊహాగానాలు ప్ర‌చారం అవుతున్నాయి

By:  Tupaki Desk   |   18 Sep 2023 4:15 AM GMT
నిప్పు లేనిదే పొగ రాదు.. అత‌డితో సామ్?
X

స‌మంత రూత్ ప్ర‌భు ఇటీవ‌లే మ‌యోసైటిస్ చికిత్స కోసం అమెరికా వెళ్లి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. చికిత్స పూర్త‌యిన అనంత‌రం తిరిగి నేరుగా హైద‌రాబాద్ కి విచ్చేసిన స‌మంత‌, ఆ త‌ర్వాత ముంబైకి వెళ్లారు. ప్ర‌స్తుతం అక్క‌డ త‌న కెరీర్ జ‌ర్నీ గురించి సీరియ‌స్ గా ప్లాన్ చేస్తున్నార‌న్న టాక్ ఉంది. అదే క్ర‌మంలో ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ ని సామ్ పార్టీలో కలుసుకున్నారన్న టాక్ ఉంది. ఆ ఇద్ద‌రూ ఒక ప్రాజెక్ట్ కోసం పని చేయాలని నిర్ణయించుకున్నారు. ధర్మ ప్రొడక్షన్స్‌లో చేయబోయే చిత్రంలో సల్మాన్‌ఖాన్‌ సరసన సమంతను నటింపజేయాలని కరణ్‌ నిర్ణయించుకున్నారని అంటున్నారు. అయితే దీనిపై సమంత కానీ, కరణ్ కానీ త‌మ సోషల్ మీడియా ద్వారా ఎలాంటి స్ప‌ష్ఠ‌త‌ను ఇవ్వ‌లేదు. ఎందుక‌నో ఆ ఇద్ద‌రూ సైలెంట్ గా ఉన్నారు.

స‌ల్మాన్ భాయ్ స‌ర‌స‌న స‌మంత న‌టించ‌డం ఖాయ‌మైన‌ట్టేన‌ని గ‌త కొంత‌కాలంగా బాలీవుడ్ మీడియాలో ఒక‌టే ఊహాగానాలు ప్ర‌చారం అవుతున్నాయి. కానీ ఆ ఇద్ద‌రూ ఏదీ ధృవీక‌రించ‌డం లేదు. ప్ర‌స్తుతానికి అంతా గ‌ప్ చుప్ గా ఉన్నారు. క‌ర‌ణ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన రాఖీ ఔర్ రాణీ కి ప్రేమ్ క‌హానీ స‌క్సెస‌య్యాక స‌ల్మాన్ అత‌డి కోసం ఓ ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాలో న‌టించాల‌నుకుంటున్నాడు. ఇందులో స‌మంతతో సౌత్ క‌నెక్ష‌న్ ఉన్న సీన్స్ ని ఎలివేట్ చేయాల‌నేది ప్లాన్. అందుకే క‌ర‌ణ్ - సామ్ ఈ ప్రాజెక్ట్ కోసం చ‌ర్చించేందుకే క‌లుసుకున్నార‌న్న టాక్ ఉంది.

నిజానికి బ్లాక్ బ‌స్ట‌ర్ జ‌వాన్ చిత్రంతోనే సమంత బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వాల్సి ఉంది. జవాన్‌లో షారుఖ్ ఖాన్‌తో రొమాన్స్ చేయాల్సిందిగా అట్లీ తొలిగా స‌మంత‌నే సంప్ర‌దించాడు. కానీ స‌మంత అప్ప‌టికి న‌టించే మూడ్ లో లేదు. ఆ త‌ర్వాత న‌య‌న‌తారకు ఆ అవ‌కాశం ద‌క్కింది. దీపికా పదుకొనే పాత్ర కోసం కూడా స‌మంత‌ను సంప్రదించాడ‌ని టాక్. కానీ సామ్ మైయోసైటిస్‌తో బాధపడుతోంది. చికిత్స కోసం విదేశాల‌కు వెళ్లాల్సి ఉన్నందున ఏ ప్రాజెక్టుల‌కు సంత‌కాలు చేయ‌లేద‌ని తెలిసింది. కార‌ణం ఏదైనా కానీ ఖాన్ ల‌తో అవ‌కాశాలొస్తున్నాయి. ఇది స‌ద‌వ‌కాశం. ఈసారి సామ్ అవ‌కాశాన్ని మిస్ చేసుకోకూడ‌ద‌నే అభిమానులు భావిస్తున్నారు.