Begin typing your search above and press return to search.

బ్రేక్ లో ఉన్న సామ్‌ కి సూపర్‌ స్టార్ మూవీలో ఛాన్స్‌!

విష్ణు వర్ధన్ సినిమా కోసమే సల్మాన్‌ ఖాన్ గుండు కొట్టించుకున్నాడు అని, ఆయన ఆర్మీ ఆఫీసర్‌ గా కనిపించబోతున్నాడు అంటున్నారు

By:  Tupaki Desk   |   14 Sep 2023 12:30 PM GMT
బ్రేక్ లో ఉన్న సామ్‌ కి సూపర్‌ స్టార్ మూవీలో ఛాన్స్‌!
X

టాలీవుడ్‌, కోలీవుడ్‌ తో పాటు ఉత్తర భారతంలో కూడా మంచి గుర్తింపు దక్కించుకున్న హీరోయిన్ సమంత. పాన్ ఇండియా హీరోయిన్ గా పేరు దక్కించుకున్న ఈ అమ్మడు అనారోగ్య కారణాలతో బ్రేక్ లో ఉంది. ఏడాది పాటు సినిమాలకు పూర్తి దూరంగా ఉంటూ విశ్రాంతి తీసుకోవాలని భావించి సమంత ఇప్పటికే సినిమాలకు దూరంగా ఉంటూ ప్రశాంత వాతావరణంలో సమయాన్ని గడుపుతోంది.

ఇలాంటి సమయంలో సమంతకు బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ సినిమాలో నటించే అవకాశం దక్కింది అంటూ వార్తలు రావడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సల్మాన్‌ ఖాన్‌ ప్రస్తుతం చేస్తున్న టైగర్ 3 సినిమా విడుదల అవ్వగానే స్టైలిష్ దర్శకుడిగా పేరు దక్కించుకున్న విష్ణు వర్ధన్ దర్శకత్వంలో ఒక సినిమాను సల్మాన్‌ ఖాన్‌ చేయబోతున్న విషయం తెల్సిందే.

విష్ణు వర్ధన్ సినిమా కోసమే సల్మాన్‌ ఖాన్ గుండు కొట్టించుకున్నాడు అని, ఆయన ఆర్మీ ఆఫీసర్‌ గా కనిపించబోతున్నాడు అంటున్నారు. కరణ్ జోహార్‌ నిర్మించబోతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా సమంత నటించే అవకాశాలు ఉన్నాయి. హీరోయిన్ కి పాన్‌ ఇండియా గుర్తింపు ఉన్నట్లయితే సౌత్ లో సినిమా మంచి బిజినెస్‌ చేసే అవకాశాలు ఉన్నాయి అంటూ కరణ్‌ ప్లాన్‌ చేసినట్లుగా తెలుస్తోంది.

అందుకే సల్మాన్‌ ఖాన్‌ కి జోడీగా సమంత హీరోయిన్‌ గా ఎంపిక అయింది. అయితే సమంత ప్రస్తుతం బ్రేక్ లో ఉంది కదా.. గతంలోనే ఈ ప్రాజెక్ట్‌ కన్ఫర్మ్‌ అయిందా లేదంటే ఇంకా చర్చల దశలో ఉందా అనేది తెలియాలి అంటే మరి కొన్నాళ్లు వెయిట్‌ చేయాల్సిందే.

హీరోయిన్‌ గా సమంత నటించడం వల్ల సల్మాన్ ఖాన్‌ సినిమా కు ఇక్కడ పాజిటివ్ బజ్ క్రియేట్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సల్మాన్‌ ఖాన్ వంటి సూపర్‌ స్టార్‌ సినిమాలో నటించే అవకాశం వచ్చింది అంటే కచ్చితంగా బాలీవుడ్ లో సమంత పాగా వేయడం ఖాయం అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సల్మాన్‌ సినిమా తర్వాత సమంత మరింతగా బాలీవుడ్ లో బిజీ అయ్యేలా రాబోయే కాలంలో ప్లాన్ చేసే అవకాశాలు ఉన్నాయి.