Begin typing your search above and press return to search.

సమంత వస్తుందా..? రాదా..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్, రౌడీ హీరో విజయ్ దేవర కొండ జంటగా నటించిన చిత్రం ఖుషీ. ఈ మూవీ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది

By:  Tupaki Desk   |   6 Sep 2023 10:50 AM GMT
సమంత వస్తుందా..? రాదా..?
X

టాలీవుడ్ స్టార్ హీరోయిన్, రౌడీ హీరో విజయ్ దేవర కొండ జంటగా నటించిన చిత్రం ఖుషీ. ఈ మూవీ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో అంచనాలతో విడుదలైన సినిమా మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. అయితే, ఈ మూవీ విడుదలకు ముందే సమంత అమెరికా వెళ్లిపోయింది. అయితే, వెళ్లేముందు ఇక్కడ ప్రమోషన్స్ చేసే వెళ్లింది. మ్యూజిక్ కన్సర్ట్ లో పార్టిసిపేట్ చేసింది.

సోషల్ మీడియా ఇన్ఫ్యూయర్స్ తో కలిసి సందడి చేసింది. ఆ తర్వాత అమెరికా వెళ్లి, అక్కడ కూడా స్పెషల్ ప్రోగ్రామ్ లు చేసి తనకు వీలైనంత వరకు ప్రమోట్ చేసింది. కానీ, మూవీ మేకర్స్ అనుకున్నంత సక్సెస్ కాలేకపోయింది. కొంత మంది సూపర్ అంటూ కామెంట్స్ చేస్తుంటే, కొందరు మాత్రం అస్సలు బాలేదన్నారు. అయితే, మూవీ టీమ్ మాత్రం సక్సెస్ మీట్స్ చేయడానికి ప్లాన్ చేస్తోంది.

ఈ క్రమంలో సక్సెస్ మీట్ లో సమంత కూడా పాల్గొంటుందని తెలుస్తోంది. ఇప్పటికే సమంత అమెరికా నుంచి హైదరాబాద్ కి వచ్చేసింది అని ప్రచారం కూడా జరుగుతోంది. నిజానికి సమంత అమెరికా వెళ్లింది మూవీ ప్రమోషన్స్ కోసం కాదు. తన మైయోసైటిస్ చికిత్స తీసుకోవడానికి. దాని కోసమే ఆమె, ఎలాంటి కొత్త సినిమాలు కూడా ఒప్పుకోకుండా, సంవత్సరం పాటు బ్రేక్ తీసుకుంది.

అయితే, అక్కడ చికిత్స తీసుకుందో లేదో కూడా తెలీదు, అప్పుడే హైదరాబాద్ కి వచ్చేసిందని తెలుస్తోంది. మళ్లీ చికిత్స కోసం అమెరికా వెళ్తుందేమో తెలీదు. కానీ, ప్రస్తుతం ఈ సక్సెస్ మీట్ కి సమంత పాల్గొంటుందా లేదా అనేది హాట్ టాపిక్ గా మారింది. సక్సెస్ మీట్ తర్వాత ఏర్పాటు చేసే ప్రెస్ మీట్ లో సమంత హాజరౌతుందా లేదా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

ఇక, ఖుషీ మూవీ విషయానికి వస్తే, మొదటి వారం కలెక్షన్లు బాగానే రాబట్టింది. మొదటి వారాంతంలో రూ.70కోట్లకు పైగా రాబట్టింది. కానీ , ఆ తర్వాత ఫుల్ గా డ్రాప్ అయిపోయింది. మళ్లీ థియేటర్స్ లోకి కొత్త సినిమా వస్తే,ఖుషీ కలెక్షన్లు మరింత డ్రాప్ అయ్యే అవకాశం ఉంది. కొన్ని ఏరియాల్లో కలెక్షన్లు దారుణంగా ఉన్నాయని, ఆ ఏరియాల్లో నష్టం వాటిల్లే అవకాశం ఉందని తెలుస్తోంది.