Begin typing your search above and press return to search.

పొట్టి స్కర్ట్ లో సామ్ స్టన్నింగ్ లుక్

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో అత్యధిక పారితోషకం అందుకుంటూ స్టార్ ఇమేజ్ ను కొనసాగిస్తున్న హీరోయిన్లలో సమంత టాప్ లిస్టులో ఉంటుంది అని చెప్పవచ్చు

By:  Tupaki Desk   |   6 Sep 2023 7:10 AM GMT
పొట్టి స్కర్ట్ లో సామ్ స్టన్నింగ్ లుక్
X

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో అత్యధిక పారితోషకం అందుకుంటూ స్టార్ ఇమేజ్ ను కొనసాగిస్తున్న హీరోయిన్లలో సమంత టాప్ లిస్టులో ఉంటుంది అని చెప్పవచ్చు. ప్రతి సినిమాలో కూడా తనను తాను కొత్తగా ప్రజెంట్ చేసుకుంటున్న ఈ సీనియర్ బ్యూటీ ఇటీవల ఖుషి సినిమాతో కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహించాడు.


ఇక బాక్సాఫీస్ వద్ద మొదటి వీకెండ్ లో ఈ సినిమా నుంచి కలెక్షన్స్ అందుకుంది. సోమవారం నుంచి మాత్రం సినిమా కలెక్షన్స్ అయితే కాస్త తగ్గాయి. ఇక వాటి సంగతి ఎలా ఉన్నా కూడా అమ్మడు సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు తన ఉనికిని చాటుకుంటూనే ఉంది. సమంత సోషల్ మీడియా ద్వారా కూడా భారీ ఆదాయాన్ని అందుకుంటుంది.

ఇక అప్పుడప్పుడు బ్రాండ్స్ ప్రమోషన్స్ చేస్తూ కూడా మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తోంది. దానికి తోడు ఆమె గ్లామర్ డోస్ కూడా పెంచే ప్రయత్నం చేస్తుంది. ఇటీవల బ్రాండ్ ప్రమోషన్స్ అలాగే తన గ్లామర్ ను కలగలిపి మరొక ఫోటో అయితే వదిలింది. అల్ట్రా గ్లామరస్ లుక్ తో సమంత సరికొత్తగా ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా పొట్టి స్కర్ట్ లో ఒకవైపు లెగ్స్ అందాలు మరోవైపు నడుము అందాలను కూడా హైలెట్ అయ్యే విధంగా డ్రింక్ తాగుతూ పోజులు ఇచ్చింది.

గతంలో కూడా హై గ్లామర్ డోస్ లో కనిపించిన సమంత ఈసారి ఈ లుక్ లో మాత్రం అంతకుమించి అనేలా అందంగా కనిపిస్తోంది అంటూ ఫాలోవర్స్ పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లో లేటెస్ట్ ఫోటోలు ట్రేండింగ్ లో కొనసాగుతున్నాయి. ఇక సమంత సినిమాల విషయానికొస్తే.. గత ఏడాది యశోద సినిమాతో పరవాలేదు అనిపించిన సమంత ఈ ఏడాది మాత్రం మొదట్లోనే శకుంతలం సినిమాతో ఊహించిన విధంగా డిజాస్టర్ ఎదుర్కొంది.

ఇక లేటెస్ట్ గా విడుదలైన ఖుషి సినిమా బాక్సాఫీస్ వద్ద పోరాడుతోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో అయితే చెన్నై స్టోరీ అని ఒక తమిళ సినిమా ఉంది. అది ఇంగ్లీషులో కూడా రాబోతోంది. అలాగే అమెజాన్ ప్రైమ్ తో కూడా ఒక ప్రాజెక్ట్ చేస్తోంది. ఇక చర్చల్లో మరో రెండు బిగ్ ప్రాజెక్ట్స్ ఉన్నట్లు సమాచారం.