Begin typing your search above and press return to search.

సామ్ అదొక్కటి చేస్తే చాలు..

అసలే చిత్రసీమలో యంగ్ హీరోయిన్స్ కు కొదవ లేదు. మరి ఇలాంటి నిలదొక్కుకోవాలంటే.. టాలెంట్ తో పాటు గ్లామర్ ఎంతో ముఖ్యం

By:  Tupaki Desk   |   4 Sep 2023 10:30 AM GMT
సామ్ అదొక్కటి చేస్తే చాలు..
X

ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ అయినా సరే.. ఎంత టాలెంట్ ఉన్నా కావాల్సింది ముందు గ్లామరే. అది ఉన్నంత కాలం ఏదో ఒకటి చేసి కెరీర్ లో సాఫీగా ముందుకెళ్లిపోవచ్చు. అదే అందంగా పరంగా వాషౌట్ అయ్యారా.. కెరీర్ కు బై చెప్పాల్సిందే. లేదంటే అడపాదడపా పాత్రలతో సరిపెట్టుకోవాలి. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే సమంత కోసమే ఇది మాట్లాడాల్సి వచ్చింది.

రీసెంట్ గా ఖుషీ సినిమాతో ఆడియెన్స్ ముందుకు వచ్చి.. సక్సెస్ ను ఖాతాలో వేసుకుంది. హీరో విజయ్ దేవరకొండకు కూడా మంచి కమ్ బ్యాక్ దక్కింది. లైగర్, యశోద, శాకుంతలంతో.. డిజాస్టర్లను అందుకున్న విజయ్-సమంత.. ఇప్పుడు ఈ సినిమా రిజల్ట్ తో ఫుల్ హ్యాపీ అయ్యారు. అయితే విజయ్ యంగ్ హీరో కాబట్టి అతనికి ఎటువంటి ఢోకా లేదు. వరుసగా సినిమాలు చేస్తూ ముందుకెళ్లిపోతాడు.

కానీ సమంత పరిస్థితి అలా కాదు. ఆమె లుక్స్​ సినిమా సినిమాకు ఛేంజ్ అవుతూ వస్తున్నాయి. వాస్తవానికి గుణశేఖర్ శాకుంతల సినిమా సమయంలో ఆమె గెటప్, లుక్స్ కు కాస్త నెగిటివ్ రిమార్క్ లు పడ్డాయి. ఆరోగ్య సమస్యల కారణంగా ఆమె ముఖంలో మార్పులు కనిపించాయి. పబ్లిక్ అప్పీరియన్స్ ఇచ్చేటప్పుడు కూడా ఆమెలో మార్పులను గమనించారు అభిమానులు.

అసలే చిత్రసీమలో యంగ్ హీరోయిన్స్ కు కొదవ లేదు. మరి ఇలాంటి నిలదొక్కుకోవాలంటే.. టాలెంట్ తో పాటు గ్లామర్ ఎంతో ముఖ్యం. అందుకే సమంత ముందు జాగ్రత్తగా సినిమాల నుంచి కాస్త బ్రేక్ తీసుకుంటూ ట్రీట్ మెంట్ కు రెడీ అయిపోయింది. దీంతో ఫ్యాన్స్ ఇక సమంత రిటైర్ అయ్యే పరిస్థితులు దగ్గరపడ్డాయనే అనుకున్నారు. చాలా మంది ఫీలయ్యారు కూడా. ఇలాంటి సమయంలో ఖుషీ సినిమాతో వచ్చిన సమంత.. కథ పరంగానే కాకుండా తన లుక్స్ పరంగా కూడా ఆకట్టుకుంది. గ్లామర్ గా, కాస్త వయసు తక్కువగానే ఉన్న అమ్మాయిగా కనిపించి పర్వాలేదనిపించింది. విజయ్ పక్కన బాగానే సెట్ అయిపోయింది. వీరిద్దరి మధ్య రొమాంటిక్-లవ్ కెమిస్ట్రీ బాగుందని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

సమంతకు ఎలాగో నటన విషయంలో చెప్పనక్కర్లేదు. ఆమె ఎప్పుడూ టాపే. కాబట్టి గ్లామర్ లుక్ ను జాగ్రత్తగా ఇలానే ఇంకాస్త మెయిన్ టెయిన్ చేయగలిగితే.. సినిమా అవకాశాలు రావాల్సిన దాని కన్నా ఇంకా ఎక్కువ వచ్చే అవకాశముంటుంది. కాబట్టి సమంత వీలైనంత కోలుకుని.. త్వరగా తన బ్రేక్ నుంచి బయటకు వచ్చి ఫుల్ యాక్టివ్ అయితే చాలు.. సమంత కెరీర్ మరింత ఊపందుకున్నట్టే.. చూడాలి మరి ఆమెకు ఎలాంటి సినిమా అవకాశాలు వస్తాయో..