Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : అక్కడ బ్రేక్‌ లేదంటున్న సమంత

సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సమంత సోషల్ మీడియాలో మాత్రం నో బ్రేక్ అన్నట్లుగా పోస్ట్‌ లు పెడుతూనే ఉంది

By:  Tupaki Desk   |   31 July 2023 6:06 AM GMT
పిక్ టాక్ : అక్కడ బ్రేక్‌ లేదంటున్న సమంత
X

మయో సైటిస్ తో పాటు విశ్రాంతి లేకుండా షూటింగ్స్ లో పాల్గొంటున్న కారణంగా సమంత పదే పదే అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటోందట. దాంతో ఆమె సినిమాలతో పాటు అన్నింటికి ఏడాది పాటు బ్రేక్ తీసుకోవాలని భావించింది. ప్రస్తుతం విదేశాల్లో సన్నిహితులతో పాటు క్వాలిటీ టైమ్ ను స్పెండ్‌ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.


సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సమంత సోషల్ మీడియాలో మాత్రం నో బ్రేక్ అన్నట్లుగా పోస్ట్‌ లు పెడుతూనే ఉంది. మొన్నటికి మొన్న కోతితో తీసుకున్న సెల్ఫీ ని షేర్ చేసిన సమంత ఆ తర్వాత కూడా తన డైలీ లైఫ్ ఫోటోలను షేర్ చేస్తూనే వచ్చింది. తాజాగా సమంత బీచ్ లో అందాల ఆరబోత ఫోటోలు.. ఫుడ్‌ అండ్‌ మ్యూజిక్ ఫోటోలు వీడియోలను షేర్ చేసింది.


సముద్ర తీరంలో అహ్లాదకరమైన సంగీతాన్ని వింటూ.. నేచురల్‌ హెల్తీ ఫుడ్ ను తింటూ జీవితాన్ని ఆస్వాదిస్తుంది అనిపించే విధంగా సామ్ షేర్ చేసిన ఫోటోలు వీడియోలు ఉన్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో లు వైరల్ అవుతున్నాయి. సామ్ ఈ ఏడాది కాలం పాటు పూర్వ ఉత్తేజాన్ని అందిపుచ్చుకుంటుందని అభిమానులు నమ్ముతున్నారు.

ఇక సమంత నటించిన ఖుషి సినిమా మరో నెల రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. విజయ్ దేవరకొండ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో ఆ సినిమా రూపొందిన విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందిన హిందీ సిటాడెల్ లో కూడా ఈమె నటించింది. ఈ రెండు ప్రాజెక్ట్‌ లు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు చివరి దశ పనుల్లో ఉన్నాయి.