Begin typing your search above and press return to search.

సమంత చేస్తానంటే వాళ్లు ఓకే అట..!

ఇక ఈ మధ్య పుష 2 స్పెషల్ సాంగ్ మీద డిస్కషన్ నడుస్తుంది. సినిమాలో ఐటం సాంగ్ కోసం బాలీవుడ్ భామలను అడుగుతున్నారని తెలుస్తుంది.

By:  Tupaki Desk   |   19 Feb 2024 6:10 AM GMT
సమంత చేస్తానంటే వాళ్లు ఓకే అట..!
X

పాన్ ఇండియా లెవెల్ లో వసూళ్ల హంగామా సృష్టించిన పుష్ప సినిమా సెకండ్ పార్ట్ కోసం ఫ్యాన్స్ అంతా కూడా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా పుష్ప రాజ్ క్యారెక్టరైజేషన్ బాలీవుడ్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది. అందుకే పుష్ప 2 పై అక్కడ ప్రేక్షకులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. పుష్ప 2 లో శ్రీ వల్లిగా రష్మిక మరోసారి తన ప్రతిభ చాటనుంది. సినిమాలో ఆమె పాత్ర త్వరగానే ఎండ్ అవుతుందని తెలుస్తుంది.

సినిమాలో మరో హీరోయిన్ ఉంటుందని తెలుస్తుండగా అది ఎవరన్నది ఇంకా క్లారిటీ రాలేదు. ఇక ఈమధ్య పుష 2 స్పెషల్ సాంగ్ మీద డిస్కషన్ నడుస్తుంది. సినిమాలో ఐటం సాంగ్ కోసం బాలీవుడ్ భామలను అడుగుతున్నారని తెలుస్తుంది. పుష్ప 1 స్పెషల్ సాంగ్ లో సమంత అదరగొట్టేసింది. ఉ అంటావా ఉ ఉ అంటావా అంటూ నేషనల్ లెవెల్ లో ఆడియన్స్ ని తన మాయలో పడేసుకుంది. ఆ సాంగ్ లో సమంత చేసిన గ్లామర్ షో కూడా సాంగ్ హిట్ కి కారణమైంది.

పుష్ప 2 లో కూడా సమంతనే రిపీట్ చేయాలని సుకుమార్ ప్లాన్. ఖుషి తర్వాత సమంత సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. అయితే స్పెషల్ సాంగ్ కోసం సమంత దాకా వెళ్తే మాత్రం కచ్చితంగా అమ్మడు ఓకే చెప్పే ఛాన్స్ ఉంటుంది. పుష్ప 1 ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సూపర్ హిట్ అందుకుంది. పుష్ప 2 పై తారాస్థాయిలో అంచనాలు ఉన్నాయి. సో ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ చేస్తే సమంతకు మరింత క్రేజ్ వచ్చే అవకాశం ఉంటుంది.

ఆల్రెడీ బాలీవుడ్ ఆడియన్స్ కి సమంత పరిచయమే. అక్కడ ఫ్యామిలీ మ్యాన్ 2 సీరీస్ లో నటించిన అమ్మడు సిటాడెల్ వెబ్ సీరీస్ లో కూడా నటించింది. పుష్ప 2 లో సమంత చేస్తే సినిమాకు ప్లస్ అవుతుందని చెప్పొచ్చు. మేకర్స్ సమంత ఓకే అంటే ఆమెనే తీసుకోవాలని అనుకుంటున్నారట. మరి సమంత నుంచి ఏమాత్రం హింట్ వచ్చినా పుష్ప 2 లో ఉ అంటావా కాదు అంతకుమించి సాంగ్ తో రెచ్చిపోవడం పక్కా అని చెప్పొచ్చు. కొద్దిపాటి గ్యాప్ తర్వాత సమంత మళ్లీ తిరిగి వరుస సినిమాలు చేయాలని చూస్తుంది. ఈ క్రమంలో పుష్ప 2 చేస్తే మాత్రం అమ్మడి కెరీర్ కి ఈ టైం లో మంచి బూస్ట్ ఇస్తుందని చెప్పొచ్చు.