Begin typing your search above and press return to search.

సమంత అలా ఫిక్స్ అయ్యే వాటిని కాదంటుందా..?

సౌత్ హీరోయిన్స్ లో తనకంటూ ఒక సెపరేట్ క్రేజ్ ఏర్పరచుకున్న భామల్లో సమంత ఒకరు.

By:  Tupaki Desk   |   15 Feb 2024 3:30 PM GMT
సమంత అలా ఫిక్స్ అయ్యే వాటిని కాదంటుందా..?
X

సౌత్ హీరోయిన్స్ లో తనకంటూ ఒక సెపరేట్ క్రేజ్ ఏర్పరచుకున్న భామల్లో సమంత ఒకరు. ఏమాయ చేసావె సినిమా నుంచి ఖుషి వరకు తను నటించిన ప్రతి సినిమాలో సమంత ది బెస్ట్ ఇచ్చుకుంటూ వచ్చింది. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు కేవలం నటించడానికి స్కోప్ ఉన్న పాత్రలు చేస్తూ వచ్చిన సమంత కెరీర్ కాస్త అటు ఇటుగా ఉన్న టైం లో గ్లామర్ రోల్స్ కి సై అనేసింది. అయితే ఆమె పర్సనల్ లైఫ్ వల్ల కెరీర్ కూడా డిస్టర్బ్ అయింది. ఆఫ్టర్ మ్యారేజ్ హీరోయిన్స్ కెరీర్ కాస్త గాడి తప్పుతాయి కానీ పెళ్లి తర్వాత సమంత స్టార్ సినిమాలు చేసి మెప్పించింది.


ఆ తర్వాత డైవర్స్ అవ్వడంతో పాటు తనకు వచ్చిన మయోసైటిస్ వల్ల కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది. యశోద, శాకుంతలం, ఖుషి సినిమాలతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది సమంత. ఆ సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా సమంత మళ్లీ నటించడం ఫ్యాన్స్ ని ఖుషి చేసింది. అయితే ఖుషి తర్వాత మళ్లీ కొంత గ్యాప్ తీసుకున్న సమంత ఈసారి స్ట్రాంగ్ గా కం బ్యాక్ ఇవ్వాలని చూస్తుంది.

ఇదిలా ఉంటే సమంత సినిమాలు చేస్తుంది కానీ ఇక మీదట అన్నీ ఫిమేల్ సెంట్రిక్ సినిమాలే చేస్తుందని అంటున్నారు. లేడీ ఓరియెంటెడ్ కథలు.. కొత్త కొత్త కథలను ప్రేక్షకుల ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తుందట సమంత. కోలీవుడ్ లో నయనతార చేస్తున్నట్టుగా డిఫరెంట్ స్టోరీస్ తో క్రేజీ అటెంప్ట్ చేయాలని చూస్తుంది సమంత. అందుకే సమంత రీ ఎంట్రీ అనగానే కమర్షియల్ సినిమాల దర్శక నిర్మాతలు ఆమెను సంప్రదించగా నో వే అనేస్తుందట.

ఇక మీదట స్టార్ సినిమాల్లో సాంగ్స్ కి రెండు డైలాగ్స్ చెప్పేందుకు తాను రెడీగా లేదట. బలమైన కథలు.. ఫిమేల్ సెంట్రిక్ కథలను చేయాలని గట్టిగా ఫిక్స్ అయ్యిందట సమంత. ఓ రకంగా సమంత ఈ నిర్ణయం స్వాగతించదగినదే అని చెప్పొచ్చు. సమంత ఏం చేసినా చూసేందుకు రెడీ అనేలా ఉన్నారు ఆమె ఫ్యాన్స్. హెల్త్ పరంగా దాదాపు ఫిట్ గా కనిపిస్తున్న సమంత తిరిగి ఫాం లోకి రావాలని ఆడియన్స్ కోరుతున్నారు. సమంత నెక్స్ట్ ప్రాజెక్ట్ పై వారంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే సమంత తన నెక్స్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుందని టాక్.