Begin typing your search above and press return to search.

ఫ్యామిలీమ్యాన్ 3 లో స‌మంత లేన‌ట్టేనా?

తెలుగు కుర్రాళ్లు రాజ్ అండ్ డీకే తెర‌కెక్కించిన‌ ఫ్యామిలీమ్యాన్ రెండు సీజ‌న్లు బంప‌ర్ హిట్ట‌యిన సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   7 May 2024 5:30 PM GMT
ఫ్యామిలీమ్యాన్ 3 లో స‌మంత లేన‌ట్టేనా?
X

తెలుగు కుర్రాళ్లు రాజ్ అండ్ డీకే తెర‌కెక్కించిన‌ ఫ్యామిలీమ్యాన్ రెండు సీజ‌న్లు బంప‌ర్ హిట్ట‌యిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్ర‌జ‌ల్లో ఆస‌క్తిని రేకెత్తించిన‌ సిరీస్ ఇది. సీజన్ 2లో ఎల్.టి.టి.ఇ తీవ్ర‌వాది రాజీ పాత్ర‌తో ఫ్యామిలీమ్యాన్ గ్రిప్ మ‌రింత పెరిగింది. రాజీ పాత్ర‌లో స‌మంత న‌ట‌న‌కు అద్భుత స్పంద‌న ద‌క్కింది. అందుకే ఈ పాత్ర‌కు కొన‌సాగింపు ఉంటుంద‌ని, ఫ్యామిలీమ్యాన్ 3లో స‌మంత‌కు ప్రాధాన్య‌త ఉంటుంద‌ని ఊహించారు.

కానీ ఇప్పుడు రాజీ పాత్రతో ప‌ని లేద‌ని టాక్ వినిపిస్తోంది. `ఫ్యామిలీమ్యాన్ 3`లో స‌మంత న‌టించ‌డం లేదు.. అందుకే ఇటీవ‌ల `ఫ్యామిలీమ్యాన్ 3` ప్ర‌క‌ట‌న‌లో ఎక్క‌డా కాస్టింగ్ లో త‌న పేరు క‌నిపించ‌లేద‌ని వాదిస్తున్నారు. ఒక‌వేళ స‌మంత ఇత‌ర షెడ్యూళ్ల వ‌ల్ల పార్ట్ 3లో క‌నిపించ‌డం లేదా? లేక‌పోతే ఛాన్స్ మిస్స‌యిందా? ఆ పాత్రను తొల‌గించారా? అంటూ చ‌ర్చ సాగుతోంది. సీజ‌న్ 3 కాస్టింగ్ లో మ‌నోజ్ భాజ్ పేయి, ప్రియ‌మ‌ణి స‌హా ఇత‌ర కీల‌క పాత్ర‌ల పేర్లు క‌నిపించినా కానీ స‌మంత పేరు ఎక్క‌డా క‌నిపించ‌లేదు.

మ‌యోసైటిస్ నుంచి బ‌య‌ట‌ప‌డి తిరిగి న‌ట‌న‌లోకి ప్ర‌వేశిస్తున్నాన‌ని స‌మంత ప్ర‌క‌టించింది. ఈ ప్ర‌క‌ట‌న త‌ర్వాత స‌మంత న‌టించే హిందీ సినిమాల‌కు సంబంధించి క్లారిటీ వ‌స్తుంద‌ని భావించారు. కానీ ఇప్ప‌టివ‌ర‌కూ బాలీవుడ్ ప్రాజెక్టులేవీ ప్ర‌క‌టించ‌లేదు. తెలుగులో ఒకే ఒక్క‌టి.. అది కూడా సొంత బ్యాన‌ర్ సినిమా (బంగారం)ని స‌మంత ప్ర‌క‌టించింది. ఇక్క‌డా ఇత‌ర బ్యాన‌ర్ల నుంచి ప్ర‌క‌ట‌న ఏదీ వెలువ‌డ‌లేదు. స‌మంత హాలీవుడ్ సినిమా చేస్తుంద‌ని కూడా ప్ర‌చార‌మైంది. కానీ దాని గురించి ఇంకా ఎలాంటి అప్ డేట్ లేదు. ఇప్పుడు ఫ్యామిలీమ్యాన్ 3లో స‌మంత న‌టించ‌డం లేద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.