Begin typing your search above and press return to search.

స్ఫూర్తి నింపిన స‌మంత‌ నో మేక‌ప్ లుక్

అభిమానుల్లో స్ఫూర్తి నింపే గొప్ప వ్య‌క్తిత్వం స‌మంతను ఇప్ప‌టికే గొప్ప సెల‌బ్రిటీగా ఆవిష్క‌రించింది

By:  Tupaki Desk   |   29 Dec 2023 12:09 PM GMT
స్ఫూర్తి నింపిన స‌మంత‌ నో మేక‌ప్ లుక్
X

అద్భుత‌మైన న‌ట‌న‌, ఫ్యాష‌న్ సెన్స్ తో నిరంత‌రం ప్ర‌జ‌ల‌ దృష్టిని త‌న‌వైపు తిప్పేసుకోవ‌డం ఎలానో స‌మంత‌కు తెలిసిన‌ట్టుగా ఇంకెవ‌రికీ తెలీదేమో! ఫిట్ నెస్ ఫ్రీక్ స‌మంత లుక్స్ విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటుంది. అభిమానుల్లో స్ఫూర్తి నింపే గొప్ప వ్య‌క్తిత్వం స‌మంతను ఇప్ప‌టికే గొప్ప సెల‌బ్రిటీగా ఆవిష్క‌రించింది. సోషల్ మీడియాలోను సామ్ ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. ఇన్ స్టాలో నిరంత‌రం త‌న‌ వ్యక్తిగత అప్‌డేట్‌లను షేర్ చేస్తుంది. ఇటీవల డిజిట‌ల్ మాధ్య‌మంలో తన వ్య‌క్తిగ‌త‌ ప్రసార ఛానెల్‌ని ప్రారంభించింది. సమంత సామాజిక మాధ్య‌మాల‌లో త‌న‌ అనుచరులతో ఘాడ‌మైన అనుబంధాన్ని క‌లిగి ఉంది. తాజాగా నో-మేకప్ సెల్ఫీని షేర్ చేసింది. ఈ లుక్ లో ఎప్పటిలాగే అందంగా కనిపిస్తోంది.


ప్ర‌స్తుతం సామ్ `నో మేక‌ప్ లుక్`పై నెటిజ‌నుల్లో ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. సామ్ ద‌శాబ్ధం పైగానే త‌న అందం సింప్లిసిటీతో మ‌న‌సులు దోచుకుంద‌ని అభిమానులు కితాబిచ్చేస్తున్నారు. కొన్ని క్లిష్ఠ ప‌రిస్థితుల్లోను సామ్ త‌న‌ను తాను నిల‌బెట్టుకుంటూ అంద‌రికీ ప్రేర‌ణ‌నిచ్చింద‌ని అభిమానులు ప్ర‌శంసిస్తున్నారు. సామ్ త‌న‌లోని విల‌క్ష‌ణ‌త‌ను ఎప్పుడూ దాచుకోకుండా అంద‌రికీ చెబుతుంది...దాప‌రికం లేని న‌టి! అది త‌న ప్ర‌త్యేక‌త అని ఒక అభిమాని సోష‌ల్ మీడియాల్లో ప్ర‌శంసించారు. ఓవ‌రాల్ గా సామ్ నో మేక‌ప్ లుక్ కి అద్భుత స్పంద‌న వ‌చ్చింది. ముఖ్యంగా త‌న వ్య‌క్తిత్వాన్ని ప్ర‌శంసించేందుకు అభిమానులు వెన‌కాడ‌లేదు. ప్ర‌స్తుతం నో మేక‌ప్ లుక్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది.

సమంత రూత్ ప్రభు మయోసైటిస్ కి చికిత్స తీసుకుని ఇప్పుడు రెట్టించిన ఉత్సాహంతో సినిమాల్లో న‌టించేందుకు సిద్ధ‌మ‌వుతోంది. త‌దుప‌రి భారీ ప్రాజెక్ట్‌లతో అల‌రించేందుకు సిద్ధంగా ఉంది. ఈ సంవ‌త్స‌రంలో దేవ‌ర‌కొండ స‌ర‌స‌న ఖుషి చిత్రంలో న‌టించిన స‌మంత ఓటీటీ కోసం సిటాడెల్ భార‌తీయ వెర్ష‌న్ లో వ‌రుణ్ ధావ‌న్ స‌ర‌స‌న న‌టించిన సంగ‌తి తెలిసిందే. `ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2`లో నటించిన సామ్ మ‌రోసారి డైనమిక్ డైరెక్టర్ ద్వయం రాజ్ & డికెతో క‌లిసి ప‌ని చేసింది. కొత్త సంవ‌త్స‌రంలో సిటాడెల్ కోసం ప్ర‌చారానికి స‌మంత సిద్ధ‌మ‌వుతోంద‌ని స‌మాచారం. త‌దుప‌రి కొన్ని ప్రాజెక్టుల గురించి స‌మంత స్వ‌యంగా ప్ర‌క‌టించే అవ‌కాశం ఉందని టాక్ వినిపిస్తోంది.