Begin typing your search above and press return to search.

సామ్ ఆ క్ష‌ణం.. ఎటో వెళ్లిపోయింది మ‌న‌సు...!

తాజాగా స‌మంత రివీల్ చేసిన ఫోటోషూట్ ప‌రిశీలిస్తే త‌న‌లో ఆలోచ‌న‌లు అంత‌ర్మ‌థ‌నానికి ఇవి సింబాలిక్ గా క‌నిపిస్తున్నాయ్.

By:  Tupaki Desk   |   22 Aug 2023 5:25 PM GMT
సామ్ ఆ క్ష‌ణం.. ఎటో వెళ్లిపోయింది మ‌న‌సు...!
X

ఎటో వెళ్లిపోయింది మ‌న‌సు.. ఇలా ఒంట‌ర‌య్యింది వ‌య‌సు...! యాథృచ్ఛికంగా అయినా కానీ ఇక్క‌డ స‌మంత ఫోజ్ చూస్తుంటే నిన్నే పెళ్లాడుతా పాట గుర్తుకు వ‌స్తుంది.. ! స‌మంత‌ను ఇలా చూస్తుంటే ఫ్యాన్స్ ఏవో ఆలోచ‌న‌ల్లోకి వెళ్లిపోవ‌డం ఖాయం. మ‌యో సైటిస్.. వ్య‌క్తిగ‌త జీవితం.. కెరీర్ స్పీడ్ ఇవేవీ త‌న‌కు ప‌ట్టవు అన్న‌ట్టుగా ఉంది ఈ వాల‌కం.


గ‌తాన్ని మ‌రిచి వ‌ర్త‌మానంలో జీవించ‌డం ఒక గొప్ప క‌ళ‌. దానిని అల‌వాటు చేసుకుంటేనే నేటిలోకంలో ముందుకు సాగ‌డం సులువు. డ‌బ్బు ఎంత ఉన్నా జీవించ‌డం అనే క‌ళ‌ను కొన‌లేం. ఈ స‌త్యాన్ని గ్ర‌హించిన‌ట్టుగా స‌మంత ఇలా త‌న లైఫ్ ని ప్ర‌శాంత‌వ‌ద‌నంతో ప్లాన్ చేసింద‌నే అనిపిస్తోంది.

ప్ర‌కృతితో మ‌మేకం అయ్యి అన్నిటినీ మ‌ర్చిపోతోంది. నిశీధిలో నిశ్శ‌బ్ధ యోగినిలా మారింది. న్యూయార్క్ సెంట్ర‌ల్ పార్క్ లో సామ్ విహారానికి సంబంధించిన ఫోటోలు ఇవి. అక్క‌డ ఇలా సింపుల్ గా కాలాన్ని ముందుకు నెట్టుకొచ్చేస్తోంది. మ‌రోవైపు ఊర‌పిచ్చుకల వీడియోని కూడా స‌మంత షేర్ చేసింది.

తాజాగా స‌మంత రివీల్ చేసిన ఫోటోషూట్ ప‌రిశీలిస్తే త‌న‌లో ఆలోచ‌న‌లు అంత‌ర్మ‌థ‌నానికి ఇవి సింబాలిక్ గా క‌నిపిస్తున్నాయ్. ప్ర‌శాంత‌మైన జీవితాన్ని ప్లాన్ చేస్కోవ‌డాన్ని బ‌ట్టే ఉంటుంద‌న‌డానికి ఈ లైఫ్ ఉదాహ‌ర‌ణ.

స‌మంత‌ ఇప్ప‌టికే దేవ‌ర‌కొండ‌తో ఖుషీ షూటింగ్ పూర్తి చేసింది. త‌దుప‌రి వ‌రుస చిత్రాల్లో న‌టించేందుకు స‌న్నాహ‌కాల్లో ఉంది. మ‌రోవైపు మ‌యోసైటిస్ కి చికిత్స కోసం అమెరికా వెళ్లిందంటూ కొన్ని మీడియాల్లో ప్ర‌చారం సాగుతోంది. ఏది ఏమైనా సామ్ ఆల్వేస్ హ్యాపీ ఇండివిడ్యువ‌ల్ ఉమెన్.. అన‌డానికి ఇవిగో ఈ ఫోటోలే తార్కాణం.