Begin typing your search above and press return to search.

సామ్ వాటితోనే సరిపెట్టేస్తుందిగా..?

సమంత ఏం చేసినా అందులో ఎంతో కొత స్పెషల్ ఉంటుంది అనుకుంటారు ఆమె అభిమానులు.

By:  Tupaki Desk   |   19 April 2024 2:30 AM GMT
సామ్ వాటితోనే సరిపెట్టేస్తుందిగా..?
X

తనకున్న అన్ని సమస్యలను సాల్వ్ చేసుకుని కానీ మళ్లీ ముఖానికి రంగేసుకోకూడదని ఫిక్స్ అయిన స్టార్ హీరోయిన్ సమంత చూస్తుంటే తిరిగి మామూలు స్థితికి వచ్చినట్టే అనిపిస్తుంది. తనకు వచ్చిన మయోసైటిస్ వల్ల ఫ్యాన్స్ ని ఆందోళనలో పడేసి తన ఫేస్ లో కూడా కళని కోల్పోయిన అమ్మడు ఇప్పుడు మళ్లీ తిరిగి చార్మింగ్ తో కనిపిస్తుంది. తను ఫాం లోకి వచ్చానని చెబుతూ సామ్ చేస్తున్న ఫోటో షూట్స్ ఆమె ఫ్యాన్స్ నే కాదు సోషల్ మీడియా ప్రియులను అలరిస్తున్నాయి.

సమంత ఏం చేసినా అందులో ఎంతో కొత స్పెషల్ ఉంటుంది అనుకుంటారు ఆమె అభిమానులు. ప్రస్తుతం సిటాడెల్ ఇండియన్ వెర్షన్ లో ఆమె నటించింది. ఆ సీరీస్ రిలీజ్ కోసం సామ్ ఫ్యాన్స్ అంతా ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ సీరీస్ కోసం బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ తో స్క్రీన్ షేర్ చేసుకుంది సమంత. ఇద్దరిని ఒకరినొకరు పొగుడుతూ సోషల్ మీడియాలో చేస్తున్న హంగామా తెలిసిందే.

అయితే సమంత సౌత్ సినిమాలు ఎప్పుడు చేస్తుంది ముఖ్యంగా సామ్ నెక్స్ట్ తెలుగు సినిమా ఏంటి అని అడిగితే మాత్రం సమాధానం రావట్లేదు. రెగ్యులర్ గా ఫోటో షూట్స్ తో మాత్రం ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్న సమంత సినిమాలను ఓకే చేసేందుకు మాత్రం ఆసక్తి కనిపించట్లేదు. సమంత కావాలనే ఇలా చేస్తుందా లేక ఆమె దగ్గరకు నిజంగానే ఎవరు వెళ్లట్లేదా అన్నది అర్ధం కావట్లేదు కానీ సమంతని తెలుగు ఆడియన్స్ చాలా మిస్ అవుతున్నారు.

తెలుగులో చివరగా విజయ్ దేవరకొండతో ఖుషి సినిమా చేసిన సమంత అందులో తనకున్న మయోసైటిస్ వ్యాధి వల్ల అనుకున్న రేంజ్ లో ఆకట్టుకోలేకపోయింది. అయితే కమర్షియల్ సినిమాలకు బదులుగా ఫీమేల్ సెంట్రిక్ సినిమాలు అయితేనే కంఫర్టబుల్ అని అనుకుంటుందట సామ్. పోనీ అలాంటి ప్రత్యేకమైన సినిమాలైనా చేయాలంటూ సమంత అభిమానులు అంటున్నారు. యూటర్న్, ఓ బేబీ కాస్త ప్రోత్సహకరంగా అనిపించినా యశోద, శాకుంతలం సినిమాల ఫలితాలు ఇబ్బంది పెట్టాయి. అందుకే సమంత లేడీ ఓరియెంటెడ్ సినిమాలైనా స్టోరీలు చాలా స్ట్రాంగ్ గా ఉండాలని అనుకుంటుంది. అందుకే సినిమాల పరంగా లేట్ అవుతుందని తెలుస్తుంది. పుష్ప 2 లో సమంత ఉంటుందని కొందరు లేదని మరికొందరు ఊరిస్తున్నారు. సుకుమార్ ప్లాన్ ప్రకారం సమంత మళ్లీ పుష్ప 2 లో సాంగ్ చేస్తే మాత్రం అది నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని చెప్పొచ్చు.