Begin typing your search above and press return to search.

ష‌రాన్ స్టోన్‌లా ఫోజిచ్చిన సామ్

ఇంత‌లోనే ఇప్పుడు స‌మంత యూనిక్ ఫోటోషూట్ ఒక‌టి అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.

By:  Tupaki Desk   |   18 March 2024 4:26 PM GMT
ష‌రాన్ స్టోన్‌లా ఫోజిచ్చిన సామ్
X

సమంత రూత్ ప్రభు వ‌రుస ఫోటోషూట్లు మ‌తులు చెడ‌గొడుతున్నాయి. ఇటీవ‌ల మ‌లేషియా విహారం నుంచి అద్భుత‌మైన ఎగ్జోటిక్ లొకేష‌న్ల‌లో ఫోటోషూట్లు వైర‌ల్ అయ్యాయి. ఇంత‌లోనే ఇప్పుడు స‌మంత యూనిక్ ఫోటోషూట్ ఒక‌టి అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.


స‌మంత కొత్త లుక్.. ఒక‌ మోనోక్రోమ్ మాస్ట‌ర్ పీస్ గా అభిమానులు అభివ‌ర్ణిస్తున్నారు. వైట్ బ్యాక్ గ్రౌండ్ లో డార్క్ లుక్ లో క‌నిపించిన సమంత లేడీ బాస్ ని త‌ల‌పించింది. సామ్ అలా చైర్ లో ఎంతో ఠీవిగా కూచుని ఉంది. త‌న హెయిర్ స్టైల్ సంథింగ్ స్పెష‌ల్ గా కొత్త గా క‌నిపిస్తోంది. ఒక స్టార్ లోని విల‌క్ష‌ణ‌త‌కు ఈ ఫోటోషూట్ అద్దం ప‌ట్టింద‌ని చెప్పాలి. బేసిక్ ఇన్ స్టింక్ట్స్ లోని ష‌రాన్ స్టోన్ పోస్ట‌ర్ లుక్ ని గుర్తు చేస్తూనే అందుకు భిన్నంగా రూపొందించిన ఫోటోషూట్ ఇది.

ఇటీవ‌ల ఇండియా టుడే కాన్ క్లేవ్ లో పాల్గొన్న స‌మంత ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను ముచ్చ‌టించింది. ఈ ఇంట‌ర్వ్యూలో `పుష్ప` గురించిన ప్ర‌స్థావ‌న వ‌చ్చింది. ఈ మూవీలో `ఊ అంటావా..` సాంగ్‌లో త‌న‌వైన అద్భుత డ్యాన్స్ మూవ్స్ తో స‌మంత అద‌ర‌గొట్టింది. త‌న‌కు షూటింగ్ సమయంలో అసౌకర్యం ఫీల‌య్యాన‌ని స‌మంత ఇప్పుడు ఓపెనై అందరికీ షాక్ ఇచ్చింది. ఇది చాలా కష్టమైన‌ది అని కూడా అంది. నేను ఎప్పుడూ సరిపోను.. నేను అందంగా లేను.. నేను ఇతర అమ్మాయిల వలె కనిపించను! అనే విమ‌ర్శ‌లకు భిన్నంగా నేను ఈ ఆపరేషన్‌ చేశాను అని సమంతా తెలిపింది.

ఇలాంటిది నాకు చాలా పెద్ద సవాల్‌.. మొదట్లో ఆత్మవిశ్వాసం లేకపోయినా అందంగా కనిపించాలని కోరుకునే మహిళలను జడ్జ్ చేయడం గతానికి సంబంధించిన విషయం అని సమంత న‌ర్మ‌గ‌ర్భంగా వ్యాఖ్యానించింది. ఇకపై తాను డ్యాన్స్ నంబర్ చేయనని కూడా తెలిపింది.