Begin typing your search above and press return to search.

ఆస్ప‌త్రిలో చేరిన‌ స‌మంత‌.. అదీ సంగ‌తి!

ఈసారి త‌న‌ చేతికి డ్రిప్స్‌తో ఆసుపత్రి బెడ్‌పై విశ్రాంతి తీసుకుంటున్న ఫోటో వైర‌ల్ అయింది.

By:  Tupaki Desk   |   12 Oct 2023 4:14 PM GMT
ఆస్ప‌త్రిలో చేరిన‌ స‌మంత‌.. అదీ సంగ‌తి!
X

ఇటీవ‌ల స‌మంత రూత్ ప్రభు సోష‌ల్ మీడియా కథనాలు అంత‌ర్జాలంలో వాడి వేడి చ‌ర్చ‌కు తావిస్తున్న సంగ‌తి తెలిసిందే. సామ్ లేటెస్ట్ ఫోటోషూట్ లో అభిమానులు కొన్ని ర‌హ‌స్యాల్ని క‌నుగొన్నారు. ఇటీవ‌ల త‌న శ‌రీరంపై నుంచి మాజీ భ‌ర్త‌ నాగ‌ చైత‌న్య (ఛాయ్) టాట్టూని తొల‌గించ‌డం చర్చ‌కు వచ్చింది.


ఇంత‌లోనే స‌మంత ఆస్ప‌త్రిలో చేరిన‌ప్ప‌టి ఫోటో ఒక‌టి అంత‌ర్జాలంలో చ‌ర్చ‌కు వ‌చ్చింది. ఈసారి త‌న‌ చేతికి డ్రిప్స్‌తో ఆసుపత్రి బెడ్‌పై విశ్రాంతి తీసుకుంటున్న ఫోటో వైర‌ల్ అయింది. త‌న‌కు మ‌యోసైటిస్ నయం కావడానికి మందులు ఎలా సహాయపడ్డాయనే వివరాలను కూడా స‌మంత తాజా సోష‌ల్ మీడియా పోస్ట్ లో వెల్ల‌డించారు. అయితే ఈ ఫోటో చూడ‌గానే వెంటనే సామ్ మ‌రోసారి తీవ్ర ప‌రిస్థితిలో ఆసుపత్రిలో చేరిందని పుకార్లు వైరల్ అయ్యాయి. నిజానికి స‌మంత‌కు ఏమంత సీరియ‌స్ గా లేదు. పైగా తన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి ప్రస్తుతం న‌ట‌న‌కు బ్రేక్ ఇచ్చి విశ్రాంతి తీసుకుంటున్నారు. ఏడాది కాలంగా సామ్ మైయోసిటిస్ అనే ఆటో ఇమ్యూన్ కండిషన్ తో బాధ‌ ప‌డుతుండ‌గా ఏడాది పాటు దీనికి చికిత్స అవ‌స‌ర‌మ‌ని కూడా తెలిసింది.


సమంత ఆసుపత్రిలో చేరిందా?

గత ఏడాది మైయోసైటిస్‌తో తన పోరాటం గురించి సమంత ఓపెనైంది. ఆ తర్వాత చికిత్స కొన‌సాగుతుండ‌గానే న‌ట‌వృత్తిని తిరిగి ప్రారంభించింది. నెల‌రోజులుగా స‌మంత విదేశీ విహారాల‌తో జాలీ లైఫ్ ని లీడ్ చేస్తోంది. ఇంత‌లోనే గురువారం (అక్టోబర్ 12) నాడు స‌మంత‌ ఆసుపత్రి బెడ్ పై క‌నిపించ‌గా ర‌క‌ర‌కాలుగా సందేహాలు వ్య‌క్త‌మ‌య్యాయి. సామ్ IV (ఇమ్యూనిటీ బూస్ట్) ద్వారా మందులు తీసుకుంటున్న ఫోటోను షేర్ చేసి, దాని అర్థం ఏమిటో వివరిస్తూ మరొక పోస్ట్‌ను పెట్టింది. స‌మంత‌ తన పోస్ట్‌లో హైదరాబాద్‌లోని డిజైర్ ఈస్తటిక్స్ అనే స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్‌ని ట్యాగ్ చేసింది.

రోగాలలో ఇంట్రావీనస్ (ఐవీ) పోషణ పాత్ర గురించి స‌మంత వెల్ల‌డించింది. దేహంలో ప్రధానంగా పోషకాహార లోపాలను పరిష్కరించడానికి ఇది ఇస్తార‌ని తెలిపింది. కొన్ని వైద్య పరిస్థితులకు రోగలక్షణ ఉపశమనాన్ని అందించే చికిత్స ఇది. అయితే IV పోషకాహార చికిత్స మాత్రమే వ్యాధుల నివార‌ణ‌కు ప‌రిష్కారం కాదని గమనించడం చాలా అవసరం. ప్రత్యేక వైద్య పరిస్థితులలో సహాయక చికిత్సగా ఉపయోగించబడుతుంది, దీనికి వారి కన్సల్టింగ్ ఫిజిషియన్ ద్వారా రోగి పరిస్థితి ఆధారంగా స‌ల‌హాలు పొందాల్సి ఉంటుంది... అని తెలిపారు.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. 'ఖుషి' విడుదలైన తర్వాత సమంత పూర్తిగా తన ఆరోగ్యంపై దృష్టి సారిస్తోంది. త‌న విరామ సమయంలో కోయంబత్తూరులోని ఒక ధ్యాన కేంద్రంలో కనిపించింది. ఆస్ట్రియాకు వెళ్లే ముందు ఆమె స్నేహితుల‌తో కలిసి బాలికి వెళ్లింది. అలాగే సమంత ఇటీవల తన మాజీ భర్త నాగ చైతన్యతో రిలేషన్ షిప్ గురించి వార్తల్లో నిలిచింది. ఇటీవల నాగ చైతన్య తాను సమంత వివాహం చేసుకున్నప్పుడు దత్తత తీసుకున్న మ‌హేష్ (ప‌ప్పీ)తో ఫోటోను షేర్ చేయ‌గా ఇది ప్యాచ్ అప్ పుకార్లకు తెర తీసింది.

మరోవైపు సమంత రూత్ ప్రభు నాగ చైతన్యతో ప్యాచ్-అప్ చర్చలకు ముగింపు పలుకుతూ కొన్ని ఫోటోల‌ను షేర్ చేయ‌డంపై చ‌ర్చ సాగింది. స‌మంత‌ తన దుబాయ్ పర్యటన నుండి కొన్ని ఫోటోలను షేర్ చేయ‌గా... వీటిలో తన మాజీ భర్త పేరుతో ఉన్న‌ 'ఛాయ్' టాటూను తన పక్కటెముకపై నుండి తొలగించినట్లు స‌మంత‌ వెల్లడించింది. ఇకపై పాత‌ పచ్చబొట్టు క‌నిపించ‌దు. సిటాడెల్ త‌ర్వాత‌ సమంత తన తదుపరి ప్రాజెక్ట్‌ను ఇంకా ప్రకటించాల్సి ఉంది.