Begin typing your search above and press return to search.

స‌మంత అందులోనూ అంతే ఘాటుగానా?

స‌మంత ఆన్ స్క్రీన్ పై ఎలాంటి సంచ‌ల‌నాల‌కు తెర తీస్తుందో చెప్పాల్సిన ప‌నిలేదు. సీన్ డిమాండ్ చేస్తే త‌గ్గేదేలే అంటూ దూసుకుపోతుంది.

By:  Tupaki Desk   |   23 Jan 2024 8:40 AM GMT
స‌మంత అందులోనూ అంతే ఘాటుగానా?
X

స‌మంత ఆన్ స్క్రీన్ పై ఎలాంటి సంచ‌ల‌నాల‌కు తెర తీస్తుందో చెప్పాల్సిన ప‌నిలేదు. సీన్ డిమాండ్ చేస్తే త‌గ్గేదేలే అంటూ దూసుకుపోతుంది. వాస్త‌వానికి అమ్మ‌డిలో ఈ యాంగిల్ తొలి సినిమా నుంచే ఉంది. కానీ సామ్ లో ఆ యాంగిల్ ని అప్ప‌ట్లో ఏ ద‌ర్శ‌కుడు హైలైట్ చేయ‌లేదు. ఇప్ప‌టిత‌రం ద‌ర్శ‌కులు తెలివిగా సామ్ ఇమేజ్ ని ఎన్ క్యాష్ చేసుకుంటున్నారు. అందులో భాగంగానే ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ లో హాట్ హాట్ పెర్పార్మెన్స్ ఇవ్వ‌డం అటుపై సుకుమార్ స‌మంత‌ని ఐటం భామ‌గా మ‌లిచి సంచ‌లనానికి తెర తీయ‌డం తెలిసిందే.

`ఊ అంటావా మావ ఊఊ అంటావా మావా` అంటూ పాన్ ఇండియానే షేక్ చేసిందంటే? అందంగా స‌మం త మాయాజాల‌మే. అటుపై `ఖుషీ`లోనూ అమ్మ‌డు అంత‌కు మించి రొమాంటిక్ పెర్పార్మెన్స్ ఇచ్చింది. ఇక `సీటాడెల్` వెబ్ సిరీస్ లో స‌మంత ఎంత హాట్ గా న‌టిస్తుందా? అని ఓ సెక్ష‌న్ ఆడియ‌న్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రియాంక చోప్రా రేంజ్ లో చెల‌రేగుతుందా? అంత‌కు మించి అనిపిస్తుందా? అని ఒక‌టే డిస్క‌ష‌న్ న‌డుస్తోంది.

ఈ నేప‌థ్యంలో నేరుగా హాలీవుడ్ సినిమాలో ఛాన్స్ అందుకోవ‌డంతో? అందులో అంత‌కు మించి అనిపి స్తుందా? అని కొత్త చ‌ర్చ‌కు తెర తీసింది అమ్మ‌డు. ప్రస్తుతం స‌మంత చెన్నై స్టోరీస్ అనే చిత్రంలో న‌టి స్తోంది. త‌మిళ‌నాడు అమ్మాయి..అమెరికా అబ్బాయి మ‌ధ్య సాగే రొమాంటిక్ ల‌వ్ స్టోరీ ఇది. ఎన్ మురళి రాసిన పాపులర్ నవల `అరేంజ్‌మెంట్ ఆఫ్ లవ్` ఆధారంగా హాలీవుడ్ ఫిల్మ్ మేకర్ ఫిలిప్ జాన్ తెర‌కెక్కి స్తున్నారు.

ఇందులో స‌మంత‌కి జోడీగా వివేక్ కల్రా న‌టిస్తున్నాడు. ఇందులో వివేక్ తో సామ్ ఘాటైన రొమాంటిక్ స‌న్నివేశాల్లో చెల‌రేగుతుంద‌ని గుస గుస వినిపిస్తుంది. హాలీవుడ్ టేస్ట్ కి త‌గ్గ‌ట్టు సినిమా ఉండాలంటే? స‌మంత ఇలాంటి ఇంటిమేట్ స‌న్నివేశాల్లో త‌ప్ప‌క న‌టించాల్సిందే. అదేమి స‌మంత‌కి పెద్ద విష‌య‌మేం కాద‌నుకోండి.