Begin typing your search above and press return to search.

సమంత 25 కోట్ల అప్పు.. ఇది మ్యాటర్!

ఇక ట్రీట్మెంట్ కోసం ఆమె ఓ హీరో దగ్గర 25 కోట్ల వరకు అప్పుగా తీసుకుందంట. అయితే ఆ హీరో ఎవరనేది తెలియదు.

By:  Tupaki Desk   |   4 Aug 2023 5:12 AM GMT
సమంత 25 కోట్ల అప్పు.. ఇది మ్యాటర్!
X

సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న అందాల భామ సమంత. ఈ బ్యూటీ నటించిన ఖుషి మూవ్ సెప్టెంబర్ 1న రిలీజ్ కాబోతోంది. విజయ్ దేవరకొండకి జోడీగా ఈ చిత్రంలో సమంత నటించడం విశేషం. మరో వైపు హిందీ వెబ్ సిరీస్ సిటాడెల్ లో కూడా సమంత నటిస్తోంది. ఈ వెబ్ సిరీస్ షూటింగ్ షెడ్యూల్ కూడా ఫినిష్ చేసినట్లు తెలుస్తోంది.

ఓ ఏడాది పాటు సినిమాలకి దూరంగా ఉంటూ రెస్ట్ తీసుకోవాలని సమంత భావిస్తోంది. సోషల్ మీడియాలో మాత్రమే యాక్టివ్ గా ఉండనుంది. ఖుషి సినిమా ప్రమోషన్స్ కి కూడా సమంత దూరంగా ఉండొచ్చని టాక్. ఈ ఏడాది శాకుంతలం సినిమాతో అతి పెద్ద డిజాస్టర్ ని ఖాతాలో వేసుకుంది. అయితే ఖుషి మూవీ మాత్రం కచ్చితంగా హిట్ అవుతుందని భావిస్తోంది.

ఇదిలా ఉంటే సమంత గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ ఇంటరెస్టింగ్ ప్రచారం నడుస్తోంది. గత ఏడాది సమంత మయోసైటిస్ వ్యాధి బారిన పడి ట్రీట్మెంట్ తీసుకుంది. ఇప్పుడు కూడా ట్రీట్మెంట్ కోసం యూఎస్ వెళ్ళబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ట్రీట్మెంట్ కోసం ఆమె ఓ హీరో దగ్గర 25 కోట్ల వరకు అప్పుగా తీసుకుందంట. అయితే ఆ హీరో ఎవరనేది తెలియదు. ఈ వార్త ప్రముఖ మీడియా లో వచ్చింది.

గతం ఏడాది మయోసైటిస్ బారిన పడినపుడు భారీగానే సమంత మెడికేషన్ కోసం ఖర్చు చేసింది. ప్రస్తుతం బాలిలో వెకేషన్ ని ఎంజాయ్ చేస్తోన్న ఈ బ్యూటీ త్వరలో అమెరికా వెళ్లనుంది. అక్కడ ఏడాది పాటు ఉండి కంప్లీట్ గా రికవరీ అయిన తర్వాత ఇండియా రానుందంట. దీనికోసం సదరు హీరో దగ్గర అప్పు చేసిందంట. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అయితే దీనిపై సమంత కాని, ఆమె టీం నుంచి కాని ఎలాంటి క్లారిటీ రాలేదు. సమంత ఓ వైపు సినిమాలు, మరో వైపు వ్యాపారాలు చేస్తూ ఫైనాన్సియల్ గా సెటిల్ అయ్యింది. ఆమె నెట్ వర్త్ 101 కోట్ల వరకు ఉంది. ప్రతి ఏడాది సినిమాలు, అండర్స్ మెంట్ లు, సోషల్ మీడియా ద్వారా ఆమె సంపాదిస్తున్నది ఆ రేంజ్ లో ఉంది. మరి ఆమెకి అప్పు తీసుకోవాల్సిన అవసరం ఏముందనేది అందరి డౌట్. కాబట్టి ఇందులో నిజం లేదని తెలుస్తోంది.