Begin typing your search above and press return to search.

స‌మంత క్ర‌ష్ ఈ హీరోపై..త‌న‌పై ఎవ‌రికి క్ర‌ష్?

అయితే అల్లు అర్జున్ పేరు చెప్పగానే సామ్ బిగ్గరగా నవ్వుతూ సమాధానం ఇచ్చింది. 'బోర్డరింగ్ ఆన్ క్రష్' అని వ్యాఖ్యానించింది.

By:  Tupaki Desk   |   17 March 2024 4:57 AM GMT
స‌మంత క్ర‌ష్ ఈ హీరోపై..త‌న‌పై ఎవ‌రికి క్ర‌ష్?
X

తొలి చూపులోనే కొంద‌రికి 'క్ర‌ష్' ఎదుర‌వుతుంది. అలాంటి క్ర‌ష్ త‌న‌కు కూడా అనుభ‌వ‌మైంద‌ని అన్నారు స‌మంత రూత్ ప్ర‌భు. శుక్రవారం న్యూఢిల్లీలో జరిగిన ఇండియా టుడే కాంక్లేవ్‌లో సమంత రూత్ ప్రభు పాల్గొన్నారు. ఈవెంట్‌లో భాగంగా ఏ నటుడు అంటే మీకు క్రష్? అని ప్ర‌శ్నించారు.

షారుఖ్ ఖాన్ పేరు చెప్పగానే.. బాలీవుడ్ సూపర్ స్టార్ అంటే తనకు గౌరవం ఉందని స‌మంత‌ చెప్పింది. ప్రభాస్ పేరు చెప్పగానే గ్రేట్ రెస్పెక్ట్ అని అంది. అయితే అల్లు అర్జున్ పేరు చెప్పగానే సామ్ బిగ్గరగా నవ్వుతూ సమాధానం ఇచ్చింది. 'బోర్డరింగ్ ఆన్ క్రష్' అని వ్యాఖ్యానించింది. పుష్ప: ది రైజ్ లోని 'ఊ అంటావా..' పాటలో స‌మంత‌ బన్నీతో కలిసి న‌ర్తించిన సంగ‌తి తెలిసిందే.

మ‌యోసైటిస్ నుంచి కోలుకుని స‌మంత కెరీర్ ప‌రంగా స్పీడ్ పెంచాల‌నుకుంటోంది. ఇటీవ‌ల‌ సామ్ ఇంటర్వ్యూల‌తో చాలా స‌మాచారం రివీలైంది. ఇటీవ‌ల‌ ఎన్నడూ లేని విధంగా ఆమె మీడియాకు అందుబాటులోకి వచ్చింది.

అయితే సమంత‌పై క్ర‌ష్ ఎవ‌రికి?

ఇంత‌కుముందు స‌మంత న‌టించిన ఖుషి ట్రైలర్ విడుద‌ల కాగానే ఈ అంద‌మైన‌ ప్రేమ‌క‌థా చిత్రంలో దేవ‌ర‌కొండ‌తో సామ్ రొమాన్స్ అద్భుతంగా పండింద‌ని కితాబు ద‌క్కింది. అదే స‌మ‌యంలో కాఫీ విత్ క‌ర‌ణ్ షోలోను దేవ‌ర‌కొండ పాల్గొన్నాడు. స‌మంత‌ను తాను ఆరాధిస్తాన‌ని కూడా విజ‌య్ దేవ‌ర‌కొండ అన్నారు. స‌మంత అద్భుతమైన మగువ .. త‌ను డార్లింగ్. ఆమె అద్బుతమయినది..త‌నంటే క్ర‌ష్! అని అన్నాడు.

నేను ఏం మాయ చేసావే చూసాను. త‌ర్వాత‌ త‌న‌ చిత్రాలన్నీ చూసినప్పుడు నాకు న‌చ్చిన న‌టి స‌మంత‌. ఒక నటిపై మ‌న‌కు క్రష్ ఉన్నప్పుడు .. తెరపై చూస్తూ ఆ నటిని ప్రేమిస్తున్నప్పుడు... త‌న‌తో వ్యక్తిగతంగా క‌లిసి పని చేస్తున్నప్పుడు.. చాలా విష‌యాలు తెలుస్తాయి. స‌మంత‌ చాలా కష్టపడి పని చేస్తుంది. మ‌నోహ‌ర‌మైన అంద‌మైన న‌టి అని కితాబిచ్చాడు దేవ‌ర‌కొండ‌. మ‌హాన‌టిలో స‌మంత స‌ర‌స‌న న‌టించిన దేవ‌ర‌కొండ‌, ఖుషిలోను జంట‌గా న‌టించాడు. ఈ జంట న‌డుమ రొమాన్స్ అద్భుతంగా వ‌ర్క‌వుటైంది.