Begin typing your search above and press return to search.

సమంత బ్రాండ్ వాల్యూ ఎంత అంటే !

ఇప్పుడు సమంత బ్రాండ్ వ్యాల్యూ గురించిన ఆసక్తికర చర్చ సోషల్‌ మీడియాలో జరుగుతోంది.

By:  Tupaki Desk   |   20 Dec 2023 3:30 PM GMT
సమంత బ్రాండ్ వాల్యూ ఎంత అంటే !
X

సమంత సినిమాలు చేయకుండా ఏడాది పాటు బ్రేక్ తీసుకున్నా కూడా రెగ్యులర్ గా వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఆమె గురించిన ఏదో ఒక విషయం సోషల్‌ మీడియా ద్వారా, మెయిన్‌ స్ట్రీమ్‌ మీడియా ద్వారా చర్చ జరుగుతూనే ఉంది. ఇప్పుడు సమంత బ్రాండ్ వ్యాల్యూ గురించిన ఆసక్తికర చర్చ సోషల్‌ మీడియాలో జరుగుతోంది.

సమంతకి పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు ఉంది. సౌత్‌ లో హీరోయిన్ గా కెరీర్‌ ను ఆరంభించిన సమంత వెబ్‌ సిరీస్ తో పాటు కొన్ని డబ్బింగ్‌ సినిమాల ద్వారా ఉత్తర భారతంలో కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ ను క్రియేట్‌ చేసుకుంది. దానికి తోడు సమంత ఇన్ స్టాలో దాదాపుగా 30 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు.

సమంతతో ఒక్క యాడ్‌ చేస్తే పాన్‌ ఇండియా రేంజ్ లో మంచి రీచ్ వస్తుంది. అంతే కాకుండా ఆమె సోషల్‌ మీడియా ద్వారా కూడా తమ ఉత్పత్తులను ప్రచారం చేస్తుంది. సోషల్‌ మీడియా మరియు మెయిన్ స్ట్రీమ్‌ మీడియా, ప్రింట్‌ మీడియా ఇలా అన్ని రకాలుగా దేశ వ్యాప్తంగా సమంత బ్రాండ్‌ అంబాసిడర్ గా చేసే ఉత్పత్తులకు ప్రచారం దక్కుతుంది.

సమంతకు ఉన్న ఫాలోయింగ్‌ మరియు ఆమె బ్రాండ్‌ అంబాసిడర్ గా చేస్తే వచ్చే రీచ్‌ ను బేరీజు వేసుకుని ఆమెకు ఏకంగా కోటి.. అంతకు మించి పారితోషికం ఇచ్చేందుకు కంపెనీలు ముందుకు వస్తున్నాయట. స్టార్‌ హీరోల స్థాయిలో సమంత బ్రాండ్‌ అంబాసిడర్ గా డబ్బు సంపాదిస్తుందని మార్కెట్‌ వర్గాల వారు అంటున్నారు.

ఏడాదికి నాలుగు అయిదు కొత్త బ్రాండ్స్ కు సమంత అంబాసిడర్ గా వ్యవహరిస్తుంది. దాంతో ఆమె సినిమాలు చేసినా చేయకున్నా కూడా భారీగా ఆమె కు ఆదాయం నమోదు అవుతుంది. అంతే కాకుండా ఆమె ఇన్ స్టా ద్వారా కూడా పెద్ద మొత్తంలో డబ్బు సంపాదిస్తుందని సమాచారం మొత్తానికి సమంత బ్రాండ్ వ్యాల్యూ బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్స్ రేంజ్ లో ఉంది అనడంలో సందేహం లేదు.

ఇక సమంత సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం బ్రేక్ లో ఉన్న సమంత అతి త్వరలోనే మళ్లీ షూటింగ్ కు హాజరు అవ్వబోతుంది. ఇక ఆమె నటించిన సిటాడెల్‌ హిందీ వెబ్‌ సిరీస్ వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల అవ్వబోతుంది. ఇక ది ఫ్యామిలీ మ్యాన్‌ కొత్త సిరీస్‌ కి కూడా సమంత ఓకే చెప్పిందని వార్తలు వస్తున్నాయి. హిందీలో వరుసగా సమంత సినిమాలు చేస్తుందని టాక్ వినిపిస్తుంది.