సమంత పాత టాటూ.. అందులో నిజమెంత?
అయితే వీడియో అంతా ఒకెత్తు అయితే నెటిజన్ల ఫోకస్ ఆమె మెడపై పడింది. ఇప్పటికే సామ్ వేయించుకున్న టాటూ మెడపై కనిపించకపోవడంతో అంతా డిస్కస్ చేసుకుంటున్నారు.
By: Tupaki Desk | 8 Jun 2025 1:27 PM ISTస్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడు ఫుల్ బిజీగా ఉంటున్న విషయం తెలిసిందే. ఓవైపు నటిగా.. మరో వైపు నిర్మాతగా.. ఇంకోవైపు బ్రాండ్ అంబాసిడర్ గా తీరిక లేకుండా గడుపుతున్నారు. అయితే సామ్.. ఇప్పటికే వివిధ బ్రాండ్లను ప్రమోట్ చేస్తున్నారు. అందులో భాగంగా పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
సీక్రెల్ ఆల్కమిస్ట్ బ్రాండ్ ప్రమోషన్ లో భాగంగా సమంత.. రీసెంట్ గా స్పెషల్ వీడియో షేర్ చేసి నథింగ్ టు హైడ్ అంటూ రాసుకొచ్చారు. ఇదొక మంచి ఉద్దేశంతో మొదలైందంటూ క్యాప్షన్ ఇచ్చారు. వీడియోలో చాలా క్యూట్ గా ఉన్న సామ్.. నవ్వుతూ కనిపించారని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. అలా ఆ వీడియో వైరల్ గా మారింది.
అయితే వీడియో అంతా ఒకెత్తు అయితే నెటిజన్ల ఫోకస్ ఆమె మెడపై పడింది. ఇప్పటికే సామ్ వేయించుకున్న టాటూ మెడపై కనిపించకపోవడంతో అంతా డిస్కస్ చేసుకుంటున్నారు. YMC (ఏమాయ చేసావె) టాటూను సామ్ రిమూవ్ చేశారా అని మాట్లాడుకుంటున్నారు. అసలేం జరిగిందోనని ఒక్కొక్కరు రెస్పాండ్ అవుతున్నారు.
ఇంకొందరేమో ప్రమోషనల్ షూట్ కదా.. కనిపించకుండా కవర్ చేసి ఉండొచ్చని అంటున్నారు. అసలు నిజమేంటోనని ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి సామ్ తన బ్రాండ్ ప్రమోషన్స్ లో భాగంగా వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కాదు గానీ.. టాటూ విషయం హాట్ టాపిక్ గా మారిపోయింది.
అయితే ఏ మాయ చేసావె మూవీతో సామ్.. సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించిన ఆ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. డెబ్యూతో వేరే లెవెల్ లో అలరించారు. తన ఫస్ట్ మూవీకి గుర్తుగా మెడపై YMC అనే టాటూ వేయించుకున్న ఆమె.. అది చాలా స్పెషల్ అని ఇప్పటికే అనేకసార్లు చెప్పారు.
కాగా, సామ్ ప్రస్తుతం రక్త్ బ్రహ్మాండ్ వెబ్ సిరీస్ లో నటిస్తుండగా.. యువరాణి పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఆ సిరీస్.. త్వరలోనే స్ట్రీమింగ్ కు రానుంది. తన సొంత బ్యానర్ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పై శుభం మూవీ నిర్మించి పాస్ అయ్యారు. ఇప్పుడు మా ఇంటి బంగారం చిత్రాన్ని నిర్మిస్తూ లీడ్ రోల్ లో నటిస్తున్నారు.
