సమంత వీపుపై చెరిగిపోని టాటూ
సమంత- నాగచైతన్య జంటగా నటించిన చిత్రం `ఏమాయ చేశావే`. షార్ట్ ఫామ్‌లో YMC అని పిలుస్తారు.
By: Tupaki Desk | 17 Jun 2025 5:09 PM ISTసమంత- నాగచైతన్య జంటగా నటించిన చిత్రం `ఏమాయ చేశావే`. షార్ట్ ఫామ్‌లో YMC అని పిలుస్తారు. ఈ మూడక్షరాలను సామ్ వీపుపై టాటూ కూడా వేయించుకుంది. అది చాలా కాలం పాటు చెరిగిపోలేదు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే చైతో సామ్ ప్రేమలో పడింది. ఆ ఇద్దరూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా క్లోజ్ అయిపోయారు. ఆ తర్వాత పెళ్లి, విడాకులు వగైరా వగైరా తెలిసిన విషయాలే.
అయితే వైఎంసి టాటూని సమంత తొలగించుకుంది! అంటూ ఇంతకుముందు ఫోటో ప్రూఫ్‌లు చూపిస్తూ కొన్ని మీడియాలు కథనాలు ప్రచురితం చేసాయి. అప్పట్లో నిజంగానే టాటూ కనిపించలేదు. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి ఆ టాటూ సామ్ వీపు మీద తిరిగి ప్రత్యక్షమైంది. దీంతో అభిమానులు ఖంగు తిన్నారు. ఇది ఎలా వచ్చింది? అంటూ ఇంతలోనే ఆరాలు మొదలయ్యాయి.
నిన్న బాంద్రాలోని ఓ జిమ్ నుంచి వెళుతున్న సమంత వీపు మీద తాటికాయంత అక్షరాలతో వైయంసి టాటూ కనిపించింది. అది అంత స్పష్టంగా కనిపించడంతో ఎప్పటికీ చెరిగిపోని పచ్చబొట్టు అని భావించాల్సి వచ్చింది. గతంలో మేకప్ తో దానిని కప్పి పుచ్చి ఉండొచ్చు. కానీ దానిని పూర్తిగా తొలగించలేదని ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది.
కెరీర్ మ్యాటర్ కి వస్తే, ఇటీవలే శుభం చిత్రంతో విజయం అందుకుంది. నటిగా, నిర్మాతగా సమంత సంతృప్తి చెందింది. రక్త్ బ్రహ్మాండ్ అనే వెబ్ సిరీస్ లోను సమంత నటిస్తోంది. రాజ్ అండ్ డీకే దీనిని నిర్మిస్తున్నారు.
