Begin typing your search above and press return to search.

స‌మంత‌కు వైజాగ్ సెంటిమెంట్!

ఈ సంద‌ర్భంగానే వైజాగ్ తో త‌న‌కున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంది. అయితే ఈ బాండింగ్ కెరీర్ మ‌ధ్య‌లోనే...ఈ మ‌ధ్య‌నే బిల్డ్ అయింది కాదు. కెరీర్ ఆరంభంలో నేని తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   6 May 2025 6:40 AM
Samantha About Vizag Sentiment
X

స‌మంత వైజాగ్ ని సెంటిమెంట్ గా భావిస్తుందా? వైజాగ్ పాజిటివ్ వైబ్ త‌న‌కు అనుకూలంగా ఉందా? అంటే స‌న్నివేశం అలాగే క‌నిపిస్తుంది. తాజాగా స‌మంత నిర్మించిన `శుభం` ప్రీ రిలీజ్ ఈవెంట్ వైజాగ్ లో నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగానే వైజాగ్ తో త‌న‌కున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంది. అయితే ఈ బాండింగ్ కెరీర్ మ‌ధ్య‌లోనే...ఈ మ‌ధ్య‌నే బిల్డ్ అయింది కాదు. కెరీర్ ఆరంభం లోనేని తెలుస్తోంది.

స‌మంత న‌టిగా `ఏమాయ చేసావే` సినిమాతో లాంచ్ అయిన సంగ‌తి తెలిసిందే. తొలి సినిమా అప్ప‌ట్లో బ్లాక్ బ‌స్ట‌ర్ అయింది. స‌మంత‌కు ల‌వ్ బుల్ ఇమేజ్ ను తీసుకొచ్చిన చిత్ర‌మిది. అయితే ఈ సినిమా స‌క్సెస్ అయిందో లేదో? అని చాలా రోజుల పాటు త‌న‌కు ఓ ర‌క‌మైన క‌న్య్పూజ‌న్ ఉండేదంది. ఆ త‌ర్వాత కొన్ని రోజుల‌కు ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి వైజాగ్ కి వ‌చ్చిన‌ప్పుడు ఇక్క‌డ అభిమానులు చూపించిన ప్రేమ‌తో ఆ సినిమా ఎంత పెద్ద స‌క్సెస్ అయిందో అర్ద‌మైంద‌ని గుర్తు చేసుకుంది.

అలాగే `రంగ‌స్థ‌లం`,` మ‌జిలీ`, `ఓ బేబి` లాంటి సినిమాలు గ్రాండ్ స‌క్సెస్ అయ్యాయి. అందుకు కార‌ణంగా ఇక్క‌డ ఈవెంట్లు నిర్వ‌హించ‌డం అన్న‌ది న‌మ్ముతున్నానంది. ఈ నేప‌థ్యంలోనే స‌మంత నిర్మిస్తున్న తొలి సినిమా `శుభ‌మ్` ప్రీ రిలీజ్ ఈవెంట్ ని స‌మంత ఇక్క‌డ నిర్వ‌హించిన‌ట్లు తెలుస్తోంది. ఎక్క‌డ స‌క్సెస్ సెంటి మెంట్ క‌లిసొస్తే అది సొంత ఇల్లు లెక్కే. చాలా కాలంపాటు స‌మంత హైద‌రాబాద్ లో ఉంది.

టాలీవుడ్ లో బిజీగా ఉన్నంత కాలం పుట్టిన‌ట్లు..మెట్టినిల్లు అదే అయింది. ఆ త‌ర్వాత ముంబై కి షిప్ట్ అయింది. కొంత కాలంగా అక్క‌డే నివాసం ఉంటుంది. సొంతంగా ప్లాట్ కొనుగోలు చేసి ఉంటుంది. అప్పు డప్పుడు త‌ల్లిదండ్రుల వ‌ద్ద‌కు వెళ్లి వ‌స్తుంటుంది. మ‌రి వైజాగ్ సక్సెస్ సెంటిమెంట్ అయిన నేప‌థ్యంలో వైజాగ్ ని కూడా త‌న సొంత ఇంటిగా భావిస్తుందా? అన్న‌ది చూడాలి. వైజాగ్ అంటే ఇష్ట‌ప‌డ‌ని సెల‌బ్రిటీ ఎవ‌రుంటారు. ముంబై త‌ర్వాత ఆ రేంజ్ ఫీల్ ఉన్న ఏకైక న‌గ‌రం వైజాగ్.