సమంత కాస్త స్పీడ్ పెంచాల్సిందే..?
ఐతే ఆ మూవీకి సంబందించిన డీటైల్స్ బయటకు రాలేదు. సౌత్ సినిమాల విషయంలో ముఖ్యంగా తెలుగు సినిమాల విషయంలో సమంత ఆచి తూచి అడుగులేస్తుందని అర్థమవుతుంది.
By: Tupaki Desk | 30 May 2025 8:45 AM ISTసిటాడెల్ తో బాలీవుడ్ ఆడియన్స్ కి మరింత దగ్గరైంది సౌత్ స్టార్ హీరోయిన్ సమంత. తెలుగులో ఈమధ్యనే శుభం సినిమాలో సర్ ప్రైజ్ చేసింది. ఈ సినిమా ఆమె సొంత నిర్మాణంలో రావడం విశేషం. సమంత నెక్స్ట్ మా ఇంటి బంగారం సినిమాతో వస్తుంది. ఐతే సమంత నెక్స్ట్ సినిమాల విషయంలో దూకుడు చూపించట్లేదు. ఆమె చేస్తున్న సినిమాల గురించి ఫ్యాన్స్ ఆసక్తి చూపిస్తుండగా అమ్మడు మాత్రం చాలా లేట్ చేస్తుంది. సమంత నెక్స్ట్ బాలీవుడ్ లో ఒక క్రేజీ ప్రాజెక్ట్ చేయబోతుందని తెలుస్తుంది.
ఐతే ఆ మూవీకి సంబందించిన డీటైల్స్ బయటకు రాలేదు. సౌత్ సినిమాల విషయంలో ముఖ్యంగా తెలుగు సినిమాల విషయంలో సమంత ఆచి తూచి అడుగులేస్తుందని అర్థమవుతుంది. కమర్షియల్ సినిమాల్లో ఆమె చేస్తా అంటే ఛాన్స్ లు వస్తాయి కానీ ఎలాంటి సినిమా పడితే అలాంటి సినిమా చేయకూడదని అనుకుంటుంది. తెలుగులో ఖుషి సినిమా తర్వాత అంతగా ఇంప్రెస్ చేసిన సినిమా అయితే రాలేదు. అందుకే సమంత సినిమా చేయడానికి సుముఖంగా లేదు.
మరోపక్క బాలీవుడ్ లో మాత్రం వరుస ప్రాజెక్ట్ లు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుందట సమంత. సౌత్ సినిమాల కన్నా హిందీలో ప్రాజెక్ట్ లు చేయడం బెటర్ అని ఫిక్స్ అయినట్టు ఉంది సమంత. బాలీవుడ్ సీరీస్ లకు సమంత బెటర్ ఆప్షన్ అయ్యింది. ఫ్యామిలీ మ్యాన్ 2, సిటాడెల్ ఇలా రెండు సీరీస్ లతో తన సత్తా చాటింది. కేవలం సీరీస్ లు మాత్రమే కాదు అక్కడ సినిమాలు కూడా చేయాలని ఆమె ఫ్యాన్స్ కోరుతున్నారు.
మొన్నటిదాకా టాలీవుడ్ లో స్టార్ హీరోలతో నటించిన సమంత అలా చేస్తూ కూడా లేడీ ఓరియెంటెడ్ కథలు చేస్తూ వచ్చింది. ఐతే తెలుగులో మళ్లీ తిరిగి వరుస సినిమాలు చేస్తే చూడాలని సమంత ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఐతే తప్పకుండా సమంతకు నచ్చే ఛాన్స్ లు వస్తే మాత్రం ఆ అవకాశాన్ని అసలు వదులుకోదనిపిస్తుంది. శుభం తో నిర్మాతగా తొలి అడుగు వేసిన సమంత నటిగానే కాదు నిర్మాతగా కూడా సినిమాలు కొనసాగించాలని చూస్తుంది. స్టార్ డైరెక్టర్స్ అందరికీ సమంత టాలెంట్ తెలుసు కాబట్టి వాళ్లే ఆమెను దృష్టిలో ఉంచుకుని పాత్రలు రాయాల్సి ఉంటుంది.
