నిర్మాతగా సమంత ఫస్ట్ టెస్ట్ పాస్..!
ఐతే సమంత నిర్మాతగా టర్న్ అవ్వడం ఫస్ట్ సినిమా రిలీజ్ అవ్వడం అంతా చకచకా జరిగిపోయాయి.
By: Tupaki Desk | 14 May 2025 1:00 AM ISTహీరోయిన్ గా కాస్త గ్యాప్ ఇచ్చిన సమంత కొత్తగా నిర్మాతగా మారి సత్తా చాటాలని ఫిక్స్ అయ్యింది. ఈ క్రమంలో శుభం అంటూ ఒక సినిమా చేసింది సమంత. నిర్మాతగా సమంత టేస్ట్ ఏంటన్నది ఈ సినిమాతో ప్రూవ్ అయ్యింది. శుభం సినిమా కమర్షియల్ లెక్కలు ఎలా ఉన్నా నిర్మాతగా మాత్రం సమంత సక్సెస్ అయ్యిందనే చెప్పాలి. ఎందుకంటే హీరోయిన్ గా ఖుషి తర్వాత పెద్దగా బయట కనిపించలేదు సమంత. ఆ తర్వాత ఆమె హెల్త్ ఇష్యూస్ వల్ల పూర్తిగా డల్ అయ్యింది.
ఐతే సమంత నిర్మాతగా టర్న్ అవ్వడం ఫస్ట్ సినిమా రిలీజ్ అవ్వడం అంతా చకచకా జరిగిపోయాయి. ఐతే నిర్మాతగా సమంత ఫస్ట్ అటెంప్ట్ తోనే ఇంప్రెస్ చేసింది. అంతా కొత్త వారితో కలిసి సమంత చేసిన ఈ ప్రయత్నం ఆకట్టుకుంది. ఎలాగు కొత్త వారు.. కంటెంట్ ఉన్న సినిమా కాబట్టి పెద్దగా ఎక్స్ పెక్టేషన్స్ ఉండవు. ఐతే సినిమాకు పెట్టిన డబ్బు రావాలి కాబట్టి సమంత కాస్త ఎక్కువ ప్రమోషన్స్ చేసింది.
సినిమా టీం కు సమంత ఫుల్ సపోర్ట్ అందించింది. అంతేకాదు ఆమె చేసిన ప్రమోషన్స్ కూడా సినిమాకు బాగా హెల్ప్ అయ్యాయి. సినిమాలో హీరోయిన్ గా నటించడం ఈజీ కానీ నిర్మాతగా చేయడం మాత్రం చాలా కష్టం. ముందు నిర్మాత డబ్బులు ఖర్చు పెడితేనే క్రియేటివ్ గా అన్ని పనులు జరుగుతుంటాయి. అందుకే సమంత నిర్మాతగా ఫస్ట్ టెస్ట్ పాస్ అయినట్టే అనిపిస్తుంది.
ఇదే కాదు తన ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ లో సమంత మా ఇంటి బంగారం అనే సినిమా కూడా చేస్తుంది. ఆ సినిమాలో సమంత ప్రధాన పాత్ర వహిస్తుంది కాబట్టి ఆ సినిమా కూడా మంచి బిజినెస్ చేసే ఛాన్స్ ఉంది. శుభం సినిమాలో సమంత క్యామియో కూడా సినిమాకు మంచి బజ్ తెచ్చింది. సో మొన్నటిదాకా హీరోయిన్ గా మాత్రమే ఆడియన్స్ కు తెలిసిన సమంత ఇక నుంచి నిర్మాతగా కూడా తన అభిరుచిని తెలిసేలా చేస్తుంది. సమంత చేస్తున్న ఈ ప్రయత్నాలు ఆమె ఫ్యాన్స్ కి సూపర్ కిక్ ఇస్తాయని చెప్పొచ్చు. ఇక సమంత యాక్టింగ్ విషయానికి వస్తే ఈమధ్యనే బాలీవుడ్ లో సిటాడెల్ సీరీస్ చేసిన సమంత అక్కడే మరో సీరీస్ కు రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది.
