సమంత కోసం గురూజీ లేడీ ఓరియేంటెడ్!
సమంత హైదరాబాద్ నుంచి ముంబైకి మకాం మార్చేసిన వేళ! దర్శకుడు త్రివిక్రమ్, సామ్ తెలుగు సినిమా లు కూడా చేయాలని...హైదరాబాద్ అప్పుడప్పుడు వచ్చి వెళ్తుండాలని కోరిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 13 May 2025 6:32 AMసమంత హైదరాబాద్ నుంచి ముంబైకి మకాం మార్చేసిన వేళ! దర్శకుడు త్రివిక్రమ్, సామ్ తెలుగు సినిమా లు కూడా చేయాలని...హైదరాబాద్ అప్పుడప్పుడు వచ్చి వెళ్తుండాలని కోరిన సంగతి తెలిసిందే. సమంత బాలీవుడ్ కెరీర్ పై దృష్టి పెట్టిన నేపథ్యంలో టాలీవుడ్ కి దూరమవుతుందనే ఆలోచనలో భాగంగా గురూజీ అలా వ్యాఖ్యానించారు. అయితే ఇటీవల జరిగిన `శుభం` ఈవెంట్ లో సామ్ మళ్లి తెలుగు సినిమాలు చేస్తా నని ప్రామిస్ చేసింది.
సరైన కథలు కుదరకపోవడంతోనే చేయడం లేదని వివరణ కూడా ఇచ్చింది. శక్తివంతమైన లేడీ ఓరి యేంటెడ్ కథలైతే బాగుంటుంది? అన్నట్లు సామ్ మాటల్లో బయట పడింది. ఈ నేపథ్యంలో తాజాగా సమం త కోసం గురూజీ రంగంలోకి దిగినట్లు ఫిలిం సర్కిల్స్ లో జోరుగా వినిపిస్తుంది. సమంత కోసం అదిరిపోయే లేడీ ఓరియేంటెడ్ స్క్రిప్ట్ సిద్దం చేస్తున్నట్లు సన్నిహితుల నుంచి లీకైంది. ప్రస్తుతం గురూజీ కూడా ఖాళీ గా నే ఉన్న సంగతి తెలిసిందే.
బన్నీతో ప్రాజెక్ట్ అనుకున్నా అది వాయిదా పడటంతో తదుపరి ప్రాజెక్ట్ వెంకటేష్ తో చేయాలనుకుంటున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే స్టోరీ సిద్దంగా ఉంది. వెంకటేష్ కాల్షీట్లు ఇవ్వగానే పట్టాలె క్కించా లన్నది ప్లాన్. అయితే ఈ గ్యాప్ లోనే సమంత కోసం స్టోరీ పనులు మొదలు పెడుతున్నట్లు సమాచారం. ఇప్పటి వరకూ గురూజీ లేడీ ఓరియేంటెడ్ స్క్రిప్ట్ లు కూడా ఎన్నడు రాయలేదు.
కానీ సమంత కోరిక మేరకు ఆ తరహా కథల కోసం కలం పడుతున్నారు. ఇప్పటికే త్రివిక్రమ్ దర్శకత్వంలో సమంత `అత్తారింటికి దారేది`, `సన్నాఫ్ సత్యమూర్తి`, `అఆ` లాంటి చిత్రాల్లో నటించిన సంగతి తెలి సిందే. మూడు సినిమాలు మంచి విజయం సాధించినవే.