సమంత వెకేషన్ వెనుక సీక్రెట్ ఇదా!
సమంత కొంత కాలంగా విదేశీ వెకేషన్లకు వెళ్తోన్న సంగతి తెలిసిందే. `ఖుషీ` రిలీజ్ తర్వాత కొన్ని నెలలు పాటు, అమెరికాలోనే ఉండిపోయింది.
By: Tupaki Desk | 5 May 2025 3:37 AMసమంత కొంత కాలంగా విదేశీ వెకేషన్లకు వెళ్తోన్న సంగతి తెలిసిందే. `ఖుషీ` రిలీజ్ తర్వాత కొన్ని నెలలు పాటు, అమెరికాలోనే ఉండిపోయింది. అంతకు ముందు ఇండియాలో ఆధ్యాత్మిక బాట పట్టింది. సమం తలో ఈ మార్పు కెరీర్ మధ్య దశలో వచ్చిందే. తొలుత ఎలాంటి వెకేషన్లకు వెళ్లేది కాదు. నిరంతరం షూ టింగ్ లతోనే బిజీగా గడిపేది. చెన్నై టూ హైదరాబాద్ తిరిగేది. మరి ఈ మార్పు వెనుక కారణాలు ఏవైనా ఉన్నాయా? అంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే.
వెకేషన్ల వల్ల ఓర్పు , సహనం అలవాటవుతుందని బలంగా నమ్ముతుందిట. యాత్రలతో వ్యక్తిగతంగా మనసు రీచార్జ్ చేయడంతో పాటు ఇంకా స్ట్రాంగ్ గా మారుతాం. అందుకే బాలీ, స్విట్జర్లాండ్,న్యూయార్క్, ఆస్ట్రియా లాంటి గొప్ప ప్రదేశాలను చూడగలిగానంది.` ప్రకృతిని ఆస్వాదించడంతో పాటు, వైల్డ్ లైఫ్ చూడటం ఇష్టమే. చూడాలనుకున్న ప్రాంతాలకు సంబంధించి వివరాలను ముందే లిస్ట్ రూపంలో రాసి పెట్టుకుంటా.
ఆ ప్రకారం తీరిక దొరికినప్పుడల్లా ఒక్కో ప్రాంతానికి వెళ్లి వస్తుంటా. అలా వెళ్లడం వల్ల మన గురించి మనం తెలుసుకుంటాం. ఎక్కడికి వెళ్లినా ఫిట్ నెస్ మాత్రం నిర్లక్ష్యం చేయను` అని తెలిపింది. ఇక సామ్ కెరీర్ సంగతి చూస్తే ఏడాదిన్నర కాలంగా సినిమాలకు దూరంగా ఉంటోన్న సంగతి తెలిసిందే. `ఖుషీ` తర్వాత వెండి తెరపై కనిపించింది లేదు. ప్రస్తుతం `మా ఇంటి బంగారం`లో నటిస్తోంది.
అలాగే `శుభమ్` లో కామియో రోల్ పోషిస్తుంది. ఈ చిత్రానికి తానే నిర్మిస్తుంది. బాలీవుడ్ లో `రక్త బ్రహ్మాండ్` వెబ్ సిరీస్ లో నటిస్తోంది. సీటాడెల్ సీజన్ 2ని మేకర్స్ అర్దంతరంగా రద్దు చేసిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన తొలి సీజన్ ఆశించిన ఫలితాలు సాధించని సంగతి తెలిసిందే.