ట్రాలాలా సీక్రెట్ చెప్పేసిన సమంత!
అయితే ట్రాలాలా నిర్మాణ సంస్థ పేరు రొటీన్ కు భిన్నంగా ఉండటంతో? దీని అర్దం ఏంటనే విషయాన్ని సమంత తొలిసారి రివీల్ చేసింది.
By: Tupaki Desk | 7 May 2025 11:47 AM ISTహీరోయిన్ సమంత ట్రాలాలా మూవీంగ్ పిక్చర్స్ పేరుతో నిర్మాణ సంస్థ స్థాపించిన సంగతి తెలిసిందే. తొలి ప్రయత్నం గా `శుభం` అనే చిత్రాన్ని నిర్మిస్తుంది. కొత్త నటీనటుల్ని పరిచయం చేస్తూ సమంత నిర్మించిన చిత్రమిది. ఇందులో సామ్ ఓ కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ట్రాలాలా నిర్మాణ సంస్థ పేరు రొటీన్ కు భిన్నంగా ఉండటంతో? దీని అర్దం ఏంటనే విషయాన్ని సమంత తొలిసారి రివీల్ చేసింది.
సమంత చిన్నప్పుడు `బ్రౌన్ గర్ల్ ఇన్ ది రెయిన్ ట్రాలాలా` అంటూ ఓ పద్యం ఎక్కవగా పాడేదట. సడెన్ గా ట్రాలాలా అనే పేరు గుర్తొచ్చే అదే పేరుతో నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసాను తప్ప అంతకు మించి మరే లాజిక్ లేదంది. తన సంస్థ ద్వారా కొత్త వాళ్లను ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే సంస్థను స్థాపించినట్లు తెలిపింది. ఎంతో మంది ప్రతిభావంతులున్నా సరైన అవకాశాలు రాక పరిశ్రమకు రాలేకపోతున్నారు.
`అలాంటి వాళ్లకు ట్రాలాలా మంచి వేదిక అవ్వాలి. ప్రతిభావంతుల్ని పైకి తీసుకురావాలి. తాను కూడా ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చానని...సీనియర్లే కావాలనుకుంటే గౌతమ్ మీనన్ ఏమాయ చేసావేలో వాళ్లనే తీసుకుని చేసేవారు. కానీ నాకు ఆయన అవకాశం కల్పించారు కాబట్టే నేడు ఈ స్థానంలో ఉన్నానంది. ఈ సినిమాలో నటీనటుల్ని చూస్తుంటే తనకు పాత రోజులు గుర్తొచ్చాయంది. ప్రతిభా వంతులకు సరైన అవకాశాలు వస్తే అద్భుతాలు సృష్టించాగలరని ధీమా వ్యక్తం చేసింది.
ట్రాలాలాకి సాధారణ పేరులు కంటే ట్రాలాలా అన్నది డిఫరెంట్ గా ఉండటంతోనే పెట్టానంది. శుభం కథ అంతా ధారావాహికతో ముడి పడి ఉంటుంది. సీరియల్స్ కి శుభం కార్డు ఎప్పుడు పడుతుందని అంతా ఎదురు చూస్తుంటారు. ఈ సినిమా కథకి..ధారావాహికకి సంబంధం ఏంటన్నది సినిమా చూస్తే తెలుస్తుందని తెలిపింది.
