Begin typing your search above and press return to search.

ఏంటి ఇది నిజమేనా సమంతా..?

విజయ్ దేవరకొండతో ఖుషి సినిమా చేసిన సమంత ఆ తర్వాత హెల్త్ ఇష్యూస్ వల్ల కాస్త గ్యాప్ తీసుకుంది.

By:  Tupaki Desk   |   26 April 2025 8:00 AM IST
ఏంటి ఇది నిజమేనా సమంతా..?
X

విజయ్ దేవరకొండతో ఖుషి సినిమా చేసిన సమంత ఆ తర్వాత హెల్త్ ఇష్యూస్ వల్ల కాస్త గ్యాప్ తీసుకుంది. ఆ నెక్స్ట్ బాలీవుడ్ లో సిటాడెల్ సీరీస్ లో నటించింది. ఐతే అదే టైం లో సమంత సొంత బ్యానర్ లో ట్రాలాలా మూవీస్ ని మొదలు పెట్టింది. తన ప్రొడక్షన్ లో తొలి సినిమాగా మా ఇంటి బంగారం అంటూ ఒక పోస్టర్ వదిలింది. అందులో సమంత తుపాకి పట్టుకుని ఉంది. ఆ సినిమా ఏమైందో ఏమో కానీ సడెన్ గా సమంత తన బ్యానర్ లో శుభం సినిమాతో సర్ ప్రైజ్ చేసింది.

ప్రవీణ్ కండ్రేగుల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అంతా న్యూ ఏజ్ యాక్టర్స్ ని తీసుకుంది. కామెడీ థ్రిల్లర్ సినిమాగా శుభం ని తెరకెక్కించారు. రిలీజైన టీజర్ కూడా ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసింది. ఐతే సమంత బ్యానర్ లో మొదలు పెట్టిన మా ఇంటి బంగారం ఏమైంది. ఈ శుభం ఎక్కడ నుంచి వచ్చింది అనుకుంటున్నారు. ఐతే శుభం సినిమా గురించి మరో న్యూస్ ఏంటంటే సమంత మా ఇంటి బంగారం సినిమానే శుభంగా మార్చాలని చెబుతున్నారు.

శుభం సినిమాలో సమంత కూడా ఉంటుందని. ఐతే ఆడియన్స్ ని కన్ ఫ్యూజ్ చేసేందుకే టైటిల్ మార్చినట్టు చెబుతున్నారు. సమంత బ్యానర్ లో తెరకెక్కిన తొలి సినిమాగా శుభం పై మంచి బజ్ ఉంది. సమంత ఫ్యాన్స్ అయితే ఈ సినిమాకు తమ సపోర్ట్ అందించాలని ఫిక్స్ అయ్యారు. ఇంతకీ సమంత మా ఇంటి బంగారమే శుభం గా మారిందా.. ఈ శుభం సినిమాలో సమంత కూడా ఉంటుందా లాంటి విషయాలు తెలియాలంటే మే 9 దాకా వెయిట్ చేయాల్సిందే.

సమంత ఇక మీదట బాలీవుడ్ లోనే కెరీర్ కొనసాగించాలని నిర్ణయించుకున్నదని అంటున్నారు. ఐతే అమ్మడి ఫ్యాన్స్ మాత్రం ఆమెను తెలుగు సినిమాల్లో చూడాలని కోరుతున్నారు. ఐతే సమంత ఒకవేళ తెలుగు సినిమాలు చేసినా కమర్షియల్ సినిమాల కన్నా ఫిమేల్ సెంట్రిక్ సినిమాల మీద ఎక్కువ ఫోకస్ చేయాలని చూస్తుంది. ఐతే సమంత చేయాలని చెప్పాలే కానీ ఆమె కోసం సరికొత్త కథలతో అప్రోచ్ అయ్యే దర్శక నిర్మాతలు ఉన్నారని చెప్పొచ్చు. మరి సమంత నెక్స్ట్ తెలుగు సినిమా ఏది అవుతుంది అన్నది చూడాలి.