Begin typing your search above and press return to search.

నిర్మాత సమంత వెనక అతనున్నాడా..?

స్టార్ హీరోయిన్ సమంత కొత్తగా నిర్మాత అవతారం ఎత్తిన విషయం తెలిసిందే. సమంత తన ప్రొడక్షన్ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ లో శుభం సినిమాను తెరకెక్కించారు.

By:  Tupaki Desk   |   8 May 2025 6:36 PM IST
Samantha Returns with a Bang as Producer for Subham
X

స్టార్ హీరోయిన్ సమంత కొత్తగా నిర్మాత అవతారం ఎత్తిన విషయం తెలిసిందే. సమంత తన ప్రొడక్షన్ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ లో శుభం సినిమాను తెరకెక్కించారు. ప్రవీణ్ కండ్రేగుల డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో నూతన నటీనటులు నటించారు. శుక్రవారం రిలీజ్ అవుతున్న ఈ సినిమా విషయంలో సమంత ఫ్యాన్స్ అంతా కూడా భారీ నమ్మకంతో ఉన్నారు. ఐతే సమంత నిర్మాతగా ఈ డేర్ స్టెప్ వేయడం వెనక ఒక వ్యక్తి ఉన్నాడని టాక్.

సౌత్ లో సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సమంత బాలీవుడ్ లో మాత్రం సీరీస్ లను కొనసాగిస్తుంది. దర్శక ద్వయం రాజ్ అండ్ డీకే లతో సమంత రెండు సీరీస్ లకు పనిచేసింది. అందులో మొదటి ఫ్యామిలీ మ్యాన్ 2 కాగా రెండోది సిటాడెల్. ఈ రెండు సీరీస్ లు చేస్తున్న టైం లోనే సమంత హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేయడం దానికి వాళ్లు సపోర్ట్ ఇవ్వడం జరిగింది.

ముఖ్యంగా రాజ్ అండ్ డీకే లలో రాజ్ నిడిమోరు తో సమంత కాస్త ఎక్కువ క్లోజ్ గా ఉంటుందని టాక్. ముంబై మీడియా అయితే సమంత రాజ్ ఇద్దరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని కూడా రాసుకొచ్చింది. ఆ వార్తల్లో నిజం ఎంత అన్నది తెలియాల్సి ఉంది. ఐతే సమంత మాత్రం శుభం సినిమా ప్రమోషన్స్ లో చాలా యాక్టివ్ గా పాల్గొంటూ ఒకప్పటి జోష్ కనబరుస్తుంది. సమంతలో ఈ మార్పుకి కారణం రాజ్ అని అంటున్నారు కొందరు.

అంతేకాదు సమంత శుభం సినిమా నిర్మించడం వెనక మోరల్ సపోర్ట్ ఇంకా గైడెన్స్ కూడా అతనే ఇచ్చి ఉంటాడని చెబుతున్నారు. రాజ్, సమంత మధ్య ఏం జరుగుతుంది అన్నది తెలియదు కానీ సమంత లో ఐదారేళ్లుగా మిస్ అయిన ఒక ప్రశాంతత సంతోషాన్ని మళ్లీ తిరిగి వచ్చింది. ఐతే ఆమె పర్సనల్ లైఫ్ విషయాల్లో ఏం జరుగుతుంది అన్నది తెలుసుకోవడం కన్నా సమంత స్వయానా ఏదో ఒకటి చెప్పే వరకు వెయిట్ చేస్తే బెటర్ అని చెప్పొచ్చు. శుభం సినిమా తో సమంత సక్సెస్ అయితే మాత్రం ఆమె నుంచి మరిన్ని మంచి సినిమాలు కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు వచ్చే అవకాశం ఉంది. సమంత నిర్మాతగా సక్సెస్ అవ్వాలని ఆమె ఫ్యాన్స్ బలంగా కోరుతున్నారు.