పెద్ద ప్లానింగ్ లోనే ఉన్న సమంత..!
స్టార్ హీరోయిన్ సమంత కొత్తగా నిర్మాత అవతారమెత్తిన విషయం తెలిసిందే. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ అంటూ సమంత సొంత నిర్మాణ సంస్థతో కొత్త జర్నీ మొదలు పెట్టింది.
By: Tupaki Desk | 5 May 2025 4:57 PMస్టార్ హీరోయిన్ సమంత కొత్తగా నిర్మాత అవతారమెత్తిన విషయం తెలిసిందే. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ అంటూ సమంత సొంత నిర్మాణ సంస్థతో కొత్త జర్నీ మొదలు పెట్టింది. నిర్మాతగా సమంత అప్రోచ్ ఎలా ఉంటుంది అనుకున్న ఆడియన్స్ కి తన తొలి సినిమా శుభం టీజర్ తోనే సర్ ప్రైజ్ చేసింది. అంతా యువ నటీనటులతో సమంత ఈ ప్రయత్నం చేసింది. ఈ సినిమాను ప్రవీణ్ కండ్రేగుల డైరెక్ట్ చేశారు. సమంత లాంటి స్టార్ హీరోయిన్ మొదటి ప్రొడక్షన్ కోసం అతన్ని తీసుకోవడం లక్కీ అని చెప్పొచ్చు.
ఐతే సమంత ఏదో సరదాగా ఈ ప్రొడక్షన్ ని మొదలు పెట్టినట్టు లేదు. శుభం తో మొదలు పెట్టిన సమంత తన ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ లో సరికొత్త ప్రయోగాలతో ముఖ్యంగా కొత్త వారితోనే సినిమాలు చేసే ప్లానింగ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. సమంత ఓ పక్క హీరోయిన్ గా నటిస్తూనే మరోపక్క తన ప్రొడక్షన్ లో సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యింది.
ఐతే సమంత బ్యానర్ కి ఒక స్పెషాలిటీ ఉండేలా కొత్త కథలు సరికొత్త కథనాలతో రాబోతున్నట్టు తెలుస్తుంది. దానికి మొదటి అడుగుగా శుభం సినిమా వస్తుంది. శుభం సినిమాలో సమంత క్యామియో కూడా ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుందని తెలుస్తుంది. తన ప్రొడక్షన్ లో వచ్చే సినిమాలు ఇటు ఫన్ తో పాటు ప్రయోగాత్మకంగా ఉండేలా చూస్తుందట సమంత.
శుభం సక్సెస్ అయితే ఏమాత్రం లేట్ చేయకుండా సమంత మరో కొత్త ప్రాజెక్ట్ ని లైన్ లో పెట్టాలని చూస్తుంది. ఇక హీరోయిన్ గా సమంత బాలీవుడ్ లో వరుస ప్రాజెక్ట్ లు చేస్తుంది. తెలుగులో ఆమెకు అవకాశాలు రావట్లేదా లేదా ఆమె కావాలని చేయట్లేదా అన్నది తెలియదు కానీ సమంత మాత్రం ఇక మీదట అటు నటిగా ఇటు నిర్మాతగా డ్యుయల్ రోల్ లో మెప్పించాలని చూస్తుంది. ఐతే నిర్మాతగా తను కొనసాగాలంటే మాత్రం ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ కూడా అవసరం ఉంటుంది. సమంత చిన్న సినిమాతో మొదలైన తన ప్రొడక్షన్ పెద్ద స్థాయిలో సినిమాలు చేయాలంటే తప్పనిసరిగా ఆమె చేస్తున్న ప్రయత్నాలు సక్సెస్ అవ్వాలి. ఎలాగు ఆమె ఫ్యాన్స్ సపోర్ట్ గా ఉంటారు ఆడియన్స్ కూడా సమంత ప్రయత్నాలు ఎంకరేజ్ చేస్తే మాత్రం అనుకున్నట్టుగానే ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.