Begin typing your search above and press return to search.

సమంత శుభం రిలీజ్.. డేర్ బాగుందిగా..!

మే 9న శుభం సినిమా రిలీజ్ లాక్ చేశారు. ఐతే ఆ డేట్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు సినిమా రిలీజ్ లాక్ చేశారు.

By:  Tupaki Desk   |   18 April 2025 7:56 PM IST
సమంత శుభం రిలీజ్.. డేర్ బాగుందిగా..!
X

సౌత్ స్టార్ హీరోయిన్ సమంత కొత్తగా నిర్మాత అవతారం ఎత్తిన సంగతి తెలిసిందే. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ లో సమంత సినిమాలు నిర్మిస్తుంది. ఈ బ్యానర్ లో మొదటి ప్రాజెక్ట్ గా శుభం ని తీసుకొస్తుంది. న్యూ టాలెంటెడ్ పీపుల్ తో సమంత చేస్తున్న ఈ ప్రయత్నం ప్రేక్షకులను మెప్పించేందుకు రాబోతుంది. సినిమా బండితో మెప్పించిన డైరెక్టర్ ప్రవీణ్ కండ్రేగుల డైరెక్షన్ లో శుభం సినిమా వస్తుంది.

ఈమధ్యనే శుభం సినిమా టీజర్ రిలీజై ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఒక మంచి సెన్సిబుల్ కంటెంట్ తో హ్యూమర్ తో కూడిన సినిమాగా శుభం వస్తుంది. అంతేకాదు వినోద ప్రధానంగా సాగేలా ఉన్న ఈ సినిమా కుటుంబం మొత్తం కలిసి చూసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో శుభం సినిమా రిలీజ్ డేట్ లాక్ చేశారు మేకర్స్. సినిమాను మే 9న రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు.

శుభం సినిమాకు వివేక్ సాగర్ నేపథ్య సంగీతం అందిస్తుండగా క్లింటన్ సెరెజో సాంగ్స్ అందిచారు. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ తో వినోదాత్మక సినిమాలను రూపొందిస్తామని సమంత చెబుతున్నారు. అంతేకాదు శుభం సినిమా కోసం తన టీం అంతా ఎంతో కష్టపడ్డారని అన్నది.

మే 9న శుభం సినిమా రిలీజ్ లాక్ చేశారు. ఐతే ఆ డేట్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు సినిమా రిలీజ్ లాక్ చేశారు. ఐతే పవన్ కళ్యాణ్ కి పోటీ కాకపోయినా శుభం సినిమా ఆరోజు రావడం చిత్ర యూనిట్ డేర్ నెస్ కి మెచ్చుకోవచ్చు. సమ్మర్ సినిమాల సందడి ప్రేక్షకులను ఆకట్టుకునేలా చేస్తాయి. సమంత తన మొదటి ప్రొడక్షన్ సినిమాను కూడా సమ్మర్ రేసుకి దించుతుంది. ఐతే శుభం సినిమా కంటెంట్ ఓరియెంటెడ్ మూవీగా వస్తుంది. కాబట్టి కాస్త ప్రమోట్ చేస్తే తప్పకుండా ఈ సినిమాకు మంచి బజ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది.

మే 9న రిలీజైన చాలా సినిమాలు మంచి సక్సెస్ సాధించాయి. సో అందుకే సమంత కూడా తన సినిమాను ఆ డేట్ న రిలీజ్ ఫిక్స్ చేసుకుంది. కొత్త టీం కొత్త టాలెంట్ తో సమంత చేస్తున్న ఈ ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతుంది అన్నది చూడాలి.