Begin typing your search above and press return to search.

సైలెంట్‌గా 'శుభం' కార్డ్‌ వేస్తున్న సమంత?

ఈ సమయంలో సమంత నిర్మాతగా ఒక తెలుగు సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు రెడీ అయింది.

By:  Tupaki Desk   |   6 May 2025 6:47 PM IST
సైలెంట్‌గా శుభం కార్డ్‌ వేస్తున్న సమంత?
X

స్టార్‌ హీరోయిన్‌ సమంత నటిగా ఈ మధ్య కాస్త స్లోగా సినిమాలు చేస్తూ వస్తోంది. గత ఏడాది పూర్తిగా సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చిన సమంత కొత్త సినిమాలను ఇప్పట్లో విడుదల చేసే పరిస్థితి కనిపించడం లేదు. తెలుగులో ఈమె చివరగా విజయ్ దేవరకొండతో కలిసి 'ఖుషి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమాకు మంచి స్పందన దక్కింది. మరో వైపు సామ్‌ నటించిన సిటాడెల్‌ వెబ్‌ సిరీస్‌ సూపర్‌ హిట్‌ అయింది. దాంతో ముందు ముందు ఈమె మరిన్ని హిందీ సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ సమయంలో సమంత నిర్మాతగా ఒక తెలుగు సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు రెడీ అయింది.

అంతా కొత్తవారితో సమంత నిర్మించిన 'శుభం' సినిమా మే 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తెలుగులో ఈ సినిమాను సమంత ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్న నేపథ్యంలో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల సమంత ముఖ్య అతిథిగా శుభం సినిమా యొక్క ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ వైజాగ్‌లో జరిగిన విషయం తెల్సిందే. ఆ సమయంలో సమంత మాట్లాడుతూ తనకు వైజాగ్‌తో ఉన్న అనుబంధం గురించి చెప్పుకొచ్చింది. మజిలీ నుంచి మొదలుకుని పలు సినిమాలు అక్కడ చేయడం జరిగింది. ఆ సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. కనుక వైజాగ్‌ ప్రేక్షకులు తన శుభం సినిమాను హిట్‌ చేయాలని కోరింది.

సమంత సినిమా అనగానే శుభం పై అంచనాలు, ఆసక్తి పెరిగింది. కానీ సినిమాకు ఆ స్థాయిలో ప్రమోషన్ చేయడం లేదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కువ హైప్‌ క్రియేట్‌ చేయకుండా సినిమాను మెల్లగా జనాల్లోకి ఎక్కించే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సమంత హీరోయిన్‌గా సినిమా వచ్చిన సమయంలో ఉండే హడావిడి నిర్మాతగా సినిమాను చేసిన సమయంలో ఉండక పోవచ్చు. కానీ ఆమె కచ్చితంగా ఈ సినిమాతో మరో విజయాన్ని దక్కించుకుంటుంది అనే విశ్వాసం అభిమానులు, మీడియా వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.

సమంత తల్చుకుంటే సినిమాపై అంచనాలు ఆకాశమే హద్దు అన్నట్లుగా పెంచే అవకాశం ఉంది. కానీ ఆమె కాస్త లో ప్రొఫైల్‌ మెయింటెన్‌ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. సినిమా కంటెంట్‌ విషయంలో కచ్చితంగా మంచి మార్కులు దక్కించుకుంటుంది. అందుకే సమంత సైలెంట్‌గానే శుభం కార్డ్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే విధంగా ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఆమె ఈ విషయంలో చాలా సీరియస్‌గా ఉన్నారని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటే ముందు ముందు మరిన్ని చిన్న సినిమాలను ఈమె నిర్మించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.