Begin typing your search above and press return to search.

సామ్ లో జోష్.. ఎన్నాళ్లకెన్నాళ్లకు..!

స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాల వేగం తగ్గించినా ఆమె ఫ్యాన్స్ మాత్రం సమంత ఎప్పుడు కనిపించినా చాలు సోషల్ మీడియాలో హడావిడి చేస్తుంటారు.

By:  Tupaki Desk   |   7 May 2025 6:14 PM
Subham Movie Promotions in Full Swing as Samantha Leads from the Front
X

స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాల వేగం తగ్గించినా ఆమె ఫ్యాన్స్ మాత్రం సమంత ఎప్పుడు కనిపించినా చాలు సోషల్ మీడియాలో హడావిడి చేస్తుంటారు. ఖుషి సినిమా తర్వాత తెలుగులో సినిమా చేయని సమంత సొంత బ్యానర్ లో మా ఇంటి బంగారం అనే సినిమా అనౌన్స్ చేసింది కానీ అది ఎంతవరకు వచ్చిందో తెలియలేదు. ఈలోగా శుభం అనే మరో సినిమా పూర్తి చేసి రిలీజ్ చేస్తుంది.

సమంత శుభం సినిమా మీద చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తుంది. కొత్త వారితో కొంత రిస్క్ ఉన్నా కంటెంట్ ని నమ్మి నిర్మాతగా తొలి అడుగే డేర్ స్టెప్ వేసింది సమంత. ప్రవీణ్ కండ్రేగుల డైరెక్షన్ లో తెరకెక్కిన శుభం సినిమా శుక్రవారం రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ బాధ్యత అంతా సమంత తన భుజాన వేసుకుంది. సమంత కూడా సినిమాలో ఉంది కాబట్టి ఆమె ఫ్యాన్స్ సినిమాపై ఆసక్తిగా ఉన్నారు.

శుభం ప్రమోషన్స్ అన్నీ కూడా సమంత చుట్టే జరుగుతున్నాయి. అంతేకాదు నిర్మాతగా మొదటి సినిమా కాబట్టి సమంత కూడా ఎలాంటి అలసట అన్నది కనిపించకుండా వరుస ఇంటర్వ్యూస్, ప్రమోషనల్ యాక్టివిటీస్ చేస్తుంది. తను హీరోయిన్ గా నటించిన దానికన్నా నిర్మాతగా చేసిన సినిమాకు సమంత ఎక్కువ ప్రమోట్ చేస్తుంది. అంతేకాదు ప్రతి ఇంటర్వ్యూలో సమంత కొత్త ఉత్సాహంతో కనిపిస్తుంది. ఒకప్పటి సమంతని గుర్తు చేసేలా సమంత నవ్వుతూ చాలా జోష్ ఫుల్ గా ఉంది.

సమంతని అలా చూసి ఫ్యాన్స్ కూడా సంతోషిస్తున్నారు. ఆమె ఎప్పుడూ ఇలా నవ్వుతూ ఉండాలని కోరుతున్నారు. శుభం సినిమా సక్సెస్ అయితే సమంత ఇలానే నిర్మాతగా కూడా వరుస సినిమాలు చేసే ఛాన్స్ ఉంటుంది. అంతేకాదు నటిగా కూడా ఇక మీదట స్పీడ్ పెంచాలని అనుకుంటుంది సమంత. మా ఇంటి బంగారం సినిమా గురించి లేటెస్ట్ అప్డేట్ ఇచ్చింది సమంత. సినిమా పూర్తయ్యాక ఆ సినిమా ప్రమోషన్స్ మొదలు పెడతామని వెల్లడించింది. మొత్తానికి శుభం సినిమాతో సమంత కొత్త జోష్ ఫ్యాన్స్ కి సూపర్ కిక్ ఇస్తుంది. బాలీవుడ్ లో కూడా సమంత నెక్స్ట్ ఒక సీరీస్ చేయబోతుందని తెలుస్తుంది. ఫ్యామిలీ మ్యాన్ 2, సిటాడెల్ సీరీస్ లతో సమంత అక్కడ సూపర్ ఫ్యాన్స్ ని ఏర్పరచుకుంది.